English   

 సుధీర్ బాబు ఫస్ట్ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది.

nannu dochukuduvate -1
2018-06-29 15:59:18

సుధీర్ బాబు.. కృష్ణ గారి అల్లుడుగా, మహేష్ బాబుకు బావగా వచ్చినా.. తనకంటూ ఓ కొత్త పాత్ సెట్ చేసుకుంటున్నాడు. లేటెస్ట్ గా సమ్మోహనంతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న సుధీర్ బాబు ఇప్పుడు తన ఫస్ట్ మూవీ ఫస్ట్ లుక్ రివీల్ చేశాడు. అదే ఇప్పటికే చాలా సినిమాలు చేసిన సుధీర్ కు ఇది ఫస్ట్ మూవీ ఎలా అవుతుందీ అనుకుంటున్నారా..? అఫ్ కోర్స్.. కానీ ఈ మూవీ సుధీర్ సొంత బ్యానర్ లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీ. యస్.. రీసెంట్ గా సుధీర్ బాబు సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాడు కదా.. ఆ ప్రొడక్షన్ లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీ ఇదన్నమాట. ఆర్ఎస్ నాయుడు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈమూవీ భలే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు.. 

ఎన్టీఆర్ గుళేబాకావాళి కథ సినిమాలోని ఓ సూపర్ హిట్ సాంగ్ పల్లవిలోని ఫస్ట్ లైన్ ను టైటిల్ గా పెట్టారు. ‘నన్ను దోచుకుందువటే’ అనేదే ఈ టైటిల్. అన్నట్టు ప్రముఖ సాహితీవేత్త, సినీ గేయ రచయిత దివంగత డాక్టర్ సి నారాయణరెడ్డి తొలి సినిమా పాట కూడా ఇదే కావడం విశేషం. మొత్తంగా గతంలో మామగారి టైటిల్స్ తో వచ్చిన సుధీర్ ఈ సారి ఎన్టీవోడి పాటను టైటిల్ గా పెట్టుకుని వస్తున్నాడు. ఈ ఫస్ట్ లుక్ లో సుధీర్ చేతిలో ఫోర్బ్స్ మాగజిన్ ఉంది. అతని ఆఫీస్ టేబుల్ పై హీరోయిన్ సెల్ఫీ తీసుకుంటూ చిలిపి ఎక్స్ ప్రెషన్ పెట్టింది. అంటే సుధీర్ బాబు బిజినెస్ మేన్ గా నటిస్తున్నాడనుకోవచ్చు. ఈ ఫస్ట్ లుక్ కూల్ గా ఉంది. నభా నటేష్ అనే భామ హీరోయిన్ గా నటిస్తోంది. అజనీష్ బి లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ నన్ను దోచుకుందువటే ఆడియన్స్ మనసులు కూడా దోచుకోవాలని కోరుకుందాం.. 
 

More Related Stories