English   

సెప్టెంబర్ లో నన్ను దోచుకుందువటే

Nannu-Dochukunduvate

సుధీర్ బాబు హీరోగా రూపొందుతోన్న సినిమా నన్నుదోచుకుందువటే.. రీసెంట్ గా ఫస్ట్ లుక్ అండ్ టీజర్ రిలీజ్ చేశారు. ఆ రెండూ ఆకట్టుకున్నాయి కూడా. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. సుధీర్ బాబు సొంతంగా స్థాపించిన ప్రొడక్షన్ హౌస్ లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీ ఇది. ఈ మూవీతో ఆర్ఎన్ నాయుడు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ మూవీకి నన్నుదోచుకుందువటే అనే టైటిలే పాజిటివ్ గా కనిపిస్తోంది. అలాగే టీజర్ లో సుధీర్ బాబు క్యారెక్టర్ మన్మథుడులో నాగార్జున క్యారెక్టర్ కు ఎక్స్ టెన్షన్ లా కనిపిస్తోంది. అది కూడా నవ్వులు పూయించేలా ఉంది. ఇక ఈమూవీని సెప్టెబర్ 13న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

ప్రస్తుతం వరుసగా పాజిటివ్ మూవీస్ తో ఉన్నాడు సుధీర్ బాబు. లాస్ట్ ఇయర్ శమంతకమణిలో అతని నటనకు ప్రశంసలు వచ్చాయి. లేటెస్ట్ గా సమ్మోహనంతో మరోసారి విజయవంతంగా ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో వస్తోన్న నన్నుదోచుకుందువటే మూవీ కంప్లీట్ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ గా చెబుతున్నారు. మరి ఈ ప్రేమకథా చిత్రమ్ సుధీర్ బాబుకు ఏమేరకు కలిసొస్తుందో చూడాలి. ఒకవేళ హిట్ కొడితే ఒకే సినిమాతో రెండు హిట్స్ అందుకున్నట్టవుతుంది. అంటే అటు నిర్మాతగా, ఇటు హీరోగా.. 

More Related Stories