English   

వైఎస్ పాద యాత్ర‌లో సుహాసిని

suhashini in YSR Biopic
2018-06-14 18:03:38

టాలీవుడ్ లో బ‌యోపిక్స్ బాగా ఊపందుకున్నాయి. ఇప్ప‌టికే వ‌చ్చిన మ‌హాన‌టి బాక్సాఫీస్ ను షేక్ చేస్తే త్వ‌ర‌లో రాబోతోన్న సినిమాలూ అప్పుడే ఆస‌క్తిని పెంచాయి. ప్ర‌స్తుతం న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు బ‌యోపిక్ కు ప్రీ ప్రొడ‌క్షన్ వ‌ర్క్స్ జ‌రుగుతున్నాయి. ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌య్య న‌టిస్తున్నాడు. ఇక‌ దీంతో వ‌చ్చే మ‌రో ఇంట్రెస్టింగ్ బ‌యోపిక్ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ ది. ఈ సినిమాకు యాత్ర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వైఎస్ పాత్ర‌లో మ‌ళ‌యాల మెగాస్టార్ మ‌మ్మూట్టి న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కూ కాస్టింగ్ కూడా పూర్త‌యిన ఈ సినిమా కూడా ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుపుకుంటోందిపుడు. ప్ర‌స్తుతం వినిపిస్తోన్న దాన్ని బ‌ట్టి యాత్ర‌లో సీనియ‌ర్ న‌టి సుహాసిని కూడా న‌టించ‌బోతోంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఆమె న‌టించే పాత్రేంటో తెలుసా.. మాజీ హోమ్ మినిస్ట‌ర్ పాత్ర‌.

రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ్ర‌తికి ఉన్న‌ప్పుడు స‌బితా ఇంద్రారెడ్డిని చెల్లెమ్మా అంటూ పిలిచేవాడు. ఆ త‌ర్వాత ఆమె పేరు చేవెళ్ల చెల్లెమ్మ‌గా స్థిర‌ప‌డిపోయింది. అంత‌కు ముందు హోమ్ మినిస్ట‌ర్ గా చేసిన దివంగ‌త‌ ఇంద్రారెడ్డి  భార్య అయిన స‌బిత‌ను రాజ‌శేఖ‌ర్ రెడ్డి కూడా హోమ్ మినిస్ట‌ర్ ను చేశాడు. అంతేకాదు.. ప్ర‌తిస్టాత్మ‌క‌మైన త‌న పాత్ర యాత్ర‌ను కూడా చేవెళ్ల నుంచే షురూ చేశాడు. అందువ‌ల్ల యాత్ర‌లో స‌బిత పాత్ర‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ పాత్ర‌లోనే సుహాసిని న‌టిస్తున్న‌ట్టు టాక్. ఇలాంటి పొలిటిక‌ల్ క్యారెక్ట‌ర్స్ త‌మిళంలో చాలా వేసింది సుహాసిని. పైగా పాత్ర కూడా ప‌వ‌ర్ ఫుల్ కాబ‌ట్టి సుహాసిని లాంటి ఆర్టిస్ట్ ఉంటే ఖ‌చ్చితంగా ఆ క్యారెక్ట‌ర్ కు వెయిట్ పెర‌గుతుంది. 

More Related Stories