English   

మోసం చేసినా మంచే జ‌రిగిందిలే సుక్కు..!

sukumar-rangasthalam
2018-04-03 10:20:40

రంగ‌స్థ‌లం థ్యాంక్స్ మీట్ లో రామ్ చ‌ర‌ణ్ ను తాను మోసం చేసాన‌ని స‌భాముఖంగా చెప్పాడు సుకుమార్. ఇప్పుడు సినిమా స‌క్సెస్ అయింది.. క‌లెక్ష‌న్ల ప్ర‌భంజ‌నం న‌డుస్తుంది కాబ‌ట్టి ఏం చేసినా చెల్లుతుంది. కానీ అదే సినిమా తేడా కొట్టి ఉంటే ఈ రోజు సుకుమార్ అనే ద‌ర్శ‌కుడిపై విమ‌ర్శ‌ల బాణాలు ప‌ట్టుకుని చాలా మంది సిద్ధంగా ఉండేవాళ్ళు. ఇవ‌న్నీ ప‌ట్టించుకోకుండా తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్లు తీసి ఈ రోజు బాహుబ‌లిని మాత్రం వ‌దిలేసి అన్ని రికార్డుల‌ను క‌దిలిస్తున్నాడు సుకుమార్. రంగ‌స్థ‌లం తీయ‌డానికి తాను పెద్ద‌గా అనుకున్న‌ది ఏమీ లేద‌ని.. ఓ ప్ర‌యోగం చేయాల‌నుకున్నాను కాబ‌ట్టి చ‌ర‌ణ్ తో అది చేసాన‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. రంగ‌స్థ‌లం క‌థ కోసం తాను ఎంత క‌ష్ట‌ప‌డినా.. త‌న‌కంటే ఈ చిత్రాన్ని న‌మ్మింది రామ్ చ‌ర‌ణ్ అని చెప్పాడు సుకుమార్. తానేం చెబితే అది మ‌రో మాట లేకుండా చేసాడు కాబ‌ట్టి.. ద‌ర్శ‌కున్ని ఇంత‌గా న‌మ్మాడు కాబ‌ట్టే ఈ చిత్రం ఇలాంటి విజ‌యం సాధించింద‌ని చెప్పాడు సుకుమార్. 

ఇందులో హీరోకు చెవుడు ఉంటుంది అన్న‌పుడు చ‌ర‌ణ్ ఏం మాట్లాడ‌లేదు.. లుంగీలు క‌ట్టుకుంటాడు అన్న‌పుడు ఏం మాట్లాడ‌లేదు.. చెవిటి మిష‌న్ పెట్టుకుంటాడు అన్న‌పుడు ఏం మాట్లాడ‌లేదు.. పోలీసుల‌తో త‌న్నులు తింటాడు అన్న‌పుడే ఏం మాట్లాడ‌లేదు.. ఇలా ఏ విష‌యంలోనూ ఇమేజ్ అనే లెక్క‌లే ప‌క్క‌కు రానివ్వ‌లేదు చ‌ర‌ణ్. అందుకే ఈ రోజు రంగ‌స్థ‌లం గురించి అంతా ఇంత‌గా మాట్లాడుకుంటున్నారు. చెవిటి మిష‌న్ ఎందుకు.. తాను స్టార్ హీరో అనే ఇమేజ్ ఒక్క‌సారి దృష్టికి వ‌చ్చినా కూడా సుకుమార్ కూడా వెన‌క‌డుగు వేసేవాడు. నిజానికి ఓ స్టార్ హీరోకు ఇలా చెవిటి మిష‌న్ పెట్ట‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అనే విష‌యంపై చాలా కాలం పాటు తాను ఆలోచించాన‌ని.. త‌ను చ‌ర‌ణ్ కు చెప్పిన వెంట‌నే మ‌రో మాట లేకుండా పెట్టుకోవ‌డం చూసి షాక్ అయిపోయాన‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. 

తనపై అంతగా నమ్మకం ఉంచిన చ‌ర‌ణ్ కు కృత‌జ్ఞ‌త‌లు చెప్ప‌డం త‌ప్ప ఏం చేయ‌గ‌ల‌న‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. అస‌లు అలా పెట్టుకుంటే అది క్లిక్ అవుతుందా లేదా.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా.. ప్రేక్ష‌కుల‌ను మెప్పించగలదా లేదా అనే విషయాలపై త‌న‌కే క్లారిటీ లేద‌ని చెప్పాడు సుకుమార్. థ్యాంక్స్ మీట్ లో త‌న మ‌న‌సులోని మాట‌ల‌న్నీ బ‌య‌టికి చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. ద‌ర్శ‌కుడిగా త‌న‌కు పూర్తిగా న‌మ్మ‌కం కుదిరిన త‌ర్వాత కానీ హీరోకు చెప్ప‌కూడ‌దు. కానీ త‌న‌కే న‌మ్మ‌కం లేకుండా ఈ సీన్స్ అన్నీ చ‌ర‌ణ్ తో చేయించి త‌న‌ను మోసం చేసాన‌ని చెప్పాడు సుకుమార్. అయితే దీనికి ఇప్పుడు వ‌స్తోన్న రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా ఉంద‌న్నాడు సుకుమార్. మొత్తానికి మోసం చేసినా కూడా అంతా బాగానే ఉంది. 

More Related Stories