English   

 అతి త్వ‌ర‌లోనే ఆర్య‌-3 ..?

alluarjun-sukumar
2018-03-21 09:17:49

ఆర్య.. అంత త్వ‌ర‌గా ఎవ‌రూ మ‌ర్చిపోలేని సినిమా. అల్లు అర్జున్ కు ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్. అంతేకాదు అత‌ని ఫ‌స్ట్ మూవీకి వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌న్నీ ఈ రెండో సినిమాకే చెరిపేశాడు. ఇక ద‌ర్శ‌కుడు సుకుమార్ కు ఇది ఫ‌స్ట్ మూవీ. అయినా ఏ మాత్రం రొటీన్ రూట్(అప్ప‌టి ట్రెండ్) లో వెళ్ల‌కుండా.. స‌రికొత్త క‌థ‌తో వ‌చ్చాడు. వేరొక‌రిని ప్రేమిస్తోన్న హీరోయిన్ ను హీరో ల‌వ్ చేయ‌డం. ఆ విష‌యాన్ని ఆడియ‌న్స్ మొత్తానికి క‌న్విన్స్ అయ్యేలా చెప్ప‌డం. ఈ కాన్సెప్ట్ కు అప్పట్లో యూత్ వెర్రెత్తిపోయారు. పెద్ద‌లు కూడా భ‌లే ఉందే అనుకున్నారు. ఒక రకంగా కాలేజ్ ల‌వ్ స్టోరీస్ లో ఆర్య ఎప్ప‌టికీ చెర‌గ‌ని చ‌రిత్ర‌. ఆ చ‌రిత్ర‌ను రిపీట్ చేయలేక‌పోయినా.. ఆర్య‌-2 తో మ‌రో కొత్త కాన్సెప్ట్ చెప్పాడు సుకుమార్. ఆల్రెడీ పెళ్లికి సిద్ధ‌మైన అమ్మాయిన త‌న ఫ్రెండ్ కోసం ఫేక్ మారేజ్ చేసుకోవ‌డం సంచ‌ల‌నం స్రుస్టించింది. అప్ప‌టికి మ‌నాళ్లింకా ఇంత మెచ్యూర్ కాలేదు కాబ‌ట్టి ఆర్య -2 బిగ్గెస్ట్ హిట్ గా నిల‌వ‌క‌పోయినా క్రిటిక్స్ నుంచి మంచి అప్లాజ్ సంపాదించింది. ఈ రెండు సినిమాల‌తో బ‌న్నీ-సుక్కూ కాంబినేష‌న్ క్రేజీగా మారిపోయింది. మ‌ళ్లీ వీరి కాంబోలో సినిమా ఎప్పుడా అని ఎదురు చూసిన వారికి ఆన్స‌ర్ అతి త్వ‌ర‌లోనే వ‌స్తున్న‌ట్టు టాక్.

ప్ర‌స్తుతం సుకుమార్ రంగ‌స్థ‌లంకు ఫినిషింగ్ ట‌చ్ ఇస్తున్నాడు. ఈ నెల 30న ఆ సినిమా రాబోతోంది. త‌ర్వాత స‌క్సెస్ ను ఎంజాయ్ చేయ‌డానికి కొంత టైమ్ తీసుకుంటాడు. అటు బ‌న్నీ కూడా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. నా పేరు సూర్య విడుద‌లైన త‌ర్వాత బ‌న్నీ- సుక్కుల మ‌ధ్య ఓ సిట్టింగ్ జ‌ర‌గ‌బోతోంది. ఈ కాంబినేష‌న్ లో సినిమా కోసం మైత్రీ మూవీస్ కాచుకుని ఉంది. అటు అల్లు అర‌వింద్ కూడా బ‌న్నీ మ‌రోసారి సుకుమార్ తో సినిమా చేయాల‌ని కోరుకుంటున్నాడు. దీంతో కాగ‌ల కాంబినేష‌న్ క‌న్ఫ‌ర్మ్ అయ్యే చాన్సుందంటున్నారు. నిజానికి ఈ మ‌ధ్య బ‌న్నీ క‌మ‌ర్షియ‌ల్ గా హిట్లు కొడుతున్నా.. అవి గొప్ప సినిమాలుగా చెప్ప‌లేం. ఈ నేప‌థ్యంలో ఇటు సుకుమార్ కు కూడా బ‌న్నీ అంటే మంచి అభిమానం ఉంది. ఆ కార‌ణంగా మ‌రోసారి ఈ ఇద్ద‌రూ క‌ల‌సి ప‌నిచేసే అవ‌కాశం ఉంద‌నేది టాలీవుడ్ టాక్. నిజానికి ఈ ఇద్ద‌రూ ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ సినిమాకూ క‌మిట్ కాలేదు. అందుకే మ‌రోసారి ఈ కాంబినేష‌న్ లో సినిమా ఎక్స్ పెక్ట్ చేయొచ్చు అంటున్నారు. సుకుమార్ చిరంజీవికి ఓ క‌థ చెప్పాడంటున్నారు. కానీ అది ఇప్ప‌ట్లో ప‌ట్టాలెక్కే చాన్స్ లేదు. సో.. మ‌రోసారి ఆర్య కాంబినేష‌న్ లో స‌నిఇమా ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.

More Related Stories