English   

సుకుమార్ రెమ్యూన‌రేష‌న్ డ‌బుల్

sukumar-mahesh
2018-04-24 10:05:16

హిట్ వెంట ప‌రుగులు తీసే పరిశ్ర‌మ ఇది. అందుకోసం ఎన్ని డ‌బ్బులైన వెద‌జ‌ల్లుతుంది. ఇప్పుడు రంగస్థలంతో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన సుకుమార్ కోసం ఇవే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అమ‌ల‌య్యాయి కూడా. దీని వ‌ల్ల అత‌ని రెమ్యూనరేష‌న్ ఏకంగా డ‌బుల్ అయిపోయింది. ఇదంతా రంగస్థ‌లం మ‌హిమ కావ‌డం విశేషం. ఇన్నాళ్లూ ఇంటిలిజెంట్ స‌బ్జెక్ట్స్ తో ఆడియ‌న్స్ లో చాలామందిని క‌న్ఫ్యూజ్ చేసిన సుకుమార్ రంగ‌స్థ‌లంతో డైరెక్ట్ హిట్ కొట్టాడు. తానూ ఊర‌మాస్ ఎంట‌ర్టైన‌ర్ తీయ‌గ‌ల‌న‌ని బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి మ‌రీ ప్రూవ్ చేసుకున్నాడు. దీంతోసుకుమార్ డిమాండ్ ఓవ‌ర్ నైట్ డ‌బుల్ అయింది. దీన్ని బ‌య‌టి వారికి ఎందుకు ఇవ్వాల‌ని మ‌ళ్లీ మైత్రీ మూవీస్ సంస్థే సుక్కూను లాక్ చేసింది. ఇందుకోసం అత‌ని రెమ్యూన‌రేష‌న్ కూడా తామే డ‌బుల్ చేశారు మైత్రీ మూవీస్ మేక‌ర్స్. రంగ‌స్థ‌లంతో అదిరిపోయే లాభాలు అందుకున్న మైత్రీ మూవీస్ సంస్థ ఇప్పుడు మ‌హేష్ బాబు డేట్స్ అందుకుంది. ఆ సినిమా కూడా సుకుమార్ చేతిలో పెట్టింది. ఇందుకోసం సుక్కూకు 15కోట్ల‌కు పైగా ఆఫ‌ర్ చేసింది. ఈ ఫిగ‌ర్ లో టాక్సెస్ ఉండ‌వు మ‌ళ్లీ. మొత్తంగా రంగ‌స్థ‌లం తో సుకుమార్  అడ‌గ‌కుండానే అంత రెమ్యూన‌రేష‌న్ ఇవ్వ‌డానికి చాలామంది నిర్మాత‌లు సిద్ధంగా ఉన్నారు. కానీ త‌మ‌కింద పెద్ద హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడికి అంత పెద్ద అమౌంట్ ఇవ్వ‌డం క‌రెక్ట్ అని భావించిన మైత్రీ మూవీస్ బ్యాన‌ర్ సుకుమార్ ను లాక్ చేసింది. మొత్తంగా ఈ ఫిగ‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కూ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, కొర‌టాల శివ( రాజ‌మౌళి ఎక్క‌డికోవెళ్లిపోయాడు) మాత్ర‌మే అందుకున్నారు. ఇప్పుడా లిస్ట్ లో సుకుమార్ కూడా చేరిపోయాడు. ఏదేమైనా.. ఇన్నాళ్లూ కొత్త క‌థ‌లు, కొత్త స్క్రీన్ ప్లే అంటూ మాస్ కు దూర‌మైన సుకుమార్ ఈ సారి వారిని డ‌బుల్ శాటిస్ ఫై చేయ‌డ‌మే కాదు.. ఏకంగా డ‌బుల్ శాల‌రీ కూడా అందుకుంటున్నాడు. 
 

More Related Stories