English   

మ‌హాన‌టి ద‌ర్శ‌కుడికి సుకుమార్ లెట‌ర్

Nag-ashwin

టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ అండ్ జెన్యూన్ డైరెక్ట‌ర్స్ లో సుకుమార్ ఒక‌డు. రంగ‌స్థలంతో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన సుకుమార్.. ఇవాళ మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ కో ఉత్త‌రం రాశాడు. ఇది చ‌దివి చాలామంది ఆశ్చ‌ర్య‌పోయారు. ఎందుకంటే ఆ ఉత్త‌రంలో ఆయ‌న చెప్పిన విష‌యం ఈగోకు సంబంధించిన‌ది. అయినా అది ప‌ట్టించుకోకుండా అత్యంత జెన్యూన్ గా ఈ ఉత్త‌రం రాశాడు. ప‌రిశ్ర‌మ‌లో చాలామందిలానే సుకుమార్ మ‌హాన‌టి సినిమా చూశారు. సినిమా చూసి థియేట‌ర్ నుంచి బ‌య‌టికొస్తుంటే ఒకావిడ‌.. నువ్వు డైరెక్ట‌రా బాబూ అన‌డిగింద‌ట‌. అందుకు సుకుమార్ అవును అన్నాడు. అంతే.. వెంట‌నే గ‌ట్టిగా ప‌ట్టుకుని.. ఎంత బాగా చూపించావో బాబూ మా సావిత్ర‌మ్మ‌ని అంటూ ఏడ్చేసింద‌ట‌. అది చూసి సుక్కూ క‌ళ్ల‌లోనే నీళ్లు తిరిగాయ‌ని.. కానీ ఆ క్ష‌నం నేను నువ్వు కాదు అని చెప్ప‌లేక‌పో్యానంటూ ఉద్వేగంగా ఉత్త‌రం రాశాడు సుకుమార్. నిజానికి సుకుమార్ లాంటి ఓ స్టార్ డైరెక్ట‌ర్ త‌న అనుభ‌వాన్నంతా య‌ధాత‌థంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయినా ఓ ద‌ర్శ‌కుడుగా.. మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఎంత హార్డ్ వ‌ర్క్ చేసిఉంటాడో ఊహించ‌గ‌ల‌డు. అందుకే చాలా ఎమోష‌న‌ల్ గా ఈ ఉత్త‌రం రాశాడు.. అయినా ఒకే ఫీల్డ్ లో ఉంటూ మ‌రొక‌రి ప్ర‌తిభ‌ను మ‌న‌స్ఫూర్తిగా మెచ్చుకోవ‌డానికీ మంచి మ‌న‌సుండాలి.

More Related Stories