English   

సుకుమార్ తో చిరంజీవి.. న‌మ్మొచ్చా..?

Chiru-sukku

ఇది నిజంగానే కోటి డాల‌ర్ల ప్ర‌శ్న‌. అనుమానానికే అనుమానం తెప్పించే కాంబినేష‌న్ ఇది. సుకుమార్ తో చిరంజీవి సినిమా చేయ‌బోతున్నాడ‌నేది ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న హాట్ న్యూస్. ప్ర‌స్తుతం ఈయ‌న రంగ‌స్థ‌లం సినిమాతో బిజీగా ఉన్నాడు. మార్చ్ 30న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఇది తెర‌కెక్కించిన తీరు న‌చ్చి సుకుమార్ తో చిరు కూడా ఓ సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఒక‌వేళ రంగ‌స్థ‌లం కానీ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిందంటే సుకుమార్ తో చిరు సినిమా చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదంటున్నారు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. ఇప్ప‌టికైతే సుకుమార్ మెగాస్టార్ కు ఓ లైన్ చెప్పాడ‌ని.. అది బాగా ఎగ్జైటింగ్ గా కూడా అనిపించింద‌ని తెలుస్తుంది. అయితే దీనిపై చిరంజీవి సీరియ‌స్ గా ఏమీ లేడ‌ని.. అన్నీ రంగ‌స్థ‌లం విడుద‌ల త‌ర్వాతే మాట్లాడుకుందామ‌ని సుకుమార్ కు చెప్పిన‌ట్లుగా వార్త‌లొస్తున్నాయి. అంటే రంగ‌స్థ‌లం కానీ హిట్టైతే సుకుమార్ ను న‌మ్మొచ్చ‌నే ధీమాతో ఉన్నాడు మెగాస్టార్. పైగా ఇప్పుడు క‌థ విన్నా కూడా చేసేదేమీ లేదు. ఎందుకంటే మ‌రో ఏడాదిన్న‌ర వ‌ర‌కు ఈయ‌న సైరాతో బిజీబిజీగానే ఉంటాడు. అంటే ఇప్ప‌టికిప్పుడు సుకుమార్-చిరంజీవి సినిమా ఊహించ‌డం క‌ష్ట‌మే. కానీ లైన్ లో మాత్రం ఉంటుంద‌నే ఊహ‌లు మాత్రం బాగానే వినిపిస్తున్నాయి. ఏదైనా అది రంగ‌స్థ‌లం ఫ‌లితంపైనే ఆధార‌ప‌డి ఉంటుంది. ఇప్పుడు చ‌ర‌ణ్ ద‌ర్శ‌కులు చిరుతో ప‌ని చేస్తుండ‌టం కూడా సుకుమార్ సినిమాకు ఆజ్యం పోస్తుంది. నాయ‌క్ త‌ర్వాత ఖైదీకి వినాయ‌క్ ప‌ని చేసాడు.. ధృవ త‌ర్వాత ఇప్పుడు సురేంద‌ర్ రెడ్డితో సైరా చేస్తున్నాడు. మ‌రి రంగ స్థ‌లం త‌ర్వాత సుకుమార్ కూడా చిరుతో ప‌ని చేస్తాడేమో..? 
 

More Related Stories