English   

ఇన్నాళ్లూ ఎక్క‌డ దాచావ్ సుకుమార్..?

Sukumar-Rangasthalam
2018-04-16 09:01:05

సుకుమార్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 14 ఏళ్లైంది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం చూసిన సుకుమార్ కు ఇప్పుడు మ‌నం చూస్తోన్న సుకుమార్ కు చాలా తేడాలే ఉన్నాయి. అస‌లు ఈయ‌న్నేనా ఇన్నాళ్లూ మ‌నం చూసింది అనే అనుమానం వ‌స్తుంది ఇప్పుడు ఈయ‌న్ని చూస్తుంటే. రంగ‌స్థ‌లం ఈయ‌న్ని చాలా అంటే చాలా మార్చేసింది. సుకుమార్ నుంచి ఇలాంటి సినిమా కూడా ఊహించొచ్చా అనేలా రంగ‌స్థ‌లం రికార్డులు కొల్ల‌గొడితే.. ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న‌లో కూడా తేడాలు చూపించేసింది రంగ‌స్థ‌లం. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో డాన్సులు చేస్తూ అల‌రించాడు సుకుమార్. ఇక ఇప్పుడు విజ‌యం సాధించిన త‌ర్వాత ఏకంగా స్టేజ్ పై అంద‌రూ చూస్తుండ‌గానే దేవీతో క‌లిసి మొన్న విజ‌యోత్స‌వ స‌భ‌లో లుంగీ డాన్స్ చేసాడు. అస‌లు సుకుమార్ లో ఈ క‌నిపించ‌ని కోణం ఏంటో చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు ప్రేక్ష‌కులు. లెక్క‌ల మాస్టారులో ఈ యాంగిల్ ఇన్నాళ్లూ ఎక్క‌డ దాచేసుకున్నాడో అంటూ న‌వ్వుకుంటున్నారు. 14 ఏళ్లుగా ఎప్పుడూ క‌నిపించ‌ని సుకుమార్ ఈ రోజు స‌డ‌న్ గా బ‌య‌టికి వ‌చ్చి ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నాడు. ఇదంతా విజ‌యం వ‌చ్చినందుకా.. లేదంటే ఈ సుకుమార్ ను ఇన్నాళ్లూ మ‌న‌సులోనే దాచేసుకున్నాడా..? ఏదేమైనా సుకుమార్ లోని ఈ మార్పును చూసి అంతా ఫిదా అయిపోతున్నారిప్పుడు. ఈయ‌న ప్ర‌స్తుతం హాలీడేస్ లో ఉన్నాడు. రెండు నెల‌ల త‌ర్వాత ఇండియాకు వ‌చ్చి అప్పుడేం చేయాలో.. ఏ హీరోతో సినిమా చేయాలో ఆలోచించ‌నున్నాడు. 
 

More Related Stories