English   

వెండితెర మీద చూసుకోవడం బాగుందట

sukumar
2019-09-15 08:05:35

నేచురల్ స్టార్ నాని హీరోగా మొన్న విడుదలయిన గ్యాంగ్ లీడర్ సినిమాపై ప్రేక్షకులతో పాటుగా సినిమా ప్రముఖుల నుండి కూడా మంచి ప్రశంశలు లభిస్తున్నాయి. మొదటి రోజు మొదటి ఆట నుండి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా, అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ తొలిసారి హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో  సీనియర్ నటి లక్ష్మి, శరణ్య మోహన్, ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ, ప్రియదర్శి, సత్య, వెన్నెల కిషోర్, అనీష్ కురువిల్లా తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో అతిధి పాత్రలో సుకుమార్ నటించడం జరిగింది. తాజాగా ఈ సినిమా చూసిన సుకుమార్ సినిమాపై స్పందించాడు. సినిమా వీక్షించిన అనంతరం సుకుమార్ చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా కలుసుకున్నారు. వారితో కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని చిత్ర యూనిట్ గొప్పగా పని చేసినట్లు చెప్పుకొచ్చారు.
సినిమాలో ఒక పాత్రలో నటించి తనను తను పెద్ద తెర మీద చూసుకున్నందుకు సంతోషంగా ఉందని గ్యాంగ్ లీడర్ టీమ్ తో ఒక ఫొటోకి స్టిల్ కూడా ఇచ్చారు. 

More Related Stories