English   

ఎస్ఆర్ క‌ళ్యాణ మండ‌పం నుండి సాంగ్ రిలీజ్

SR Kalyanamandapam Song
2021-06-23 14:43:53

ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా నుండి ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా తాజాగా చిత్ర‌యూనిట్ మ‌రో పాట‌ను విడుద‌ల చేసింది. అయితే ఈ పాట‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సంధ‌ర్భంగా సుకుమార్ మాట్లాడుతూ... నేను ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాలో ఒక పాటను విడుదల చేయబోతున్నాను. ఈ పాట పేరు 'సిగ్గెందుకు రా మామ' ఈ పాట నేను విన్నాను చాలా బాగుంది. ఈ పాటకు స్వరాలు సమకూర్చిన చేతన్ భరద్వాజ్ గారికి నేను పెద్ద అభిమానిని... మీరు సమకూర్చిన ఆర్ ఎక్స్ 100 పాటలంటే నాకు చాలా ఇష్టం. అలాగే ఈ సినిమాకు హీరో మాత్రమే కాకుండా కథ స్క్రీన్ప్లే మాటలు రాసిన కిరణ్ అబ్బవరం, దర్శకుడు శ్రీధర్ కు ఈ పాటకు లిరిక్స్ రాసిన భాస్కరభట్ల గారికి కి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను అని తెలిపారు. ఇదివరకే ఈ సినిమా నుండి విడుదలయిన పాటలు శ్రోతలను ఆకట్టుకుంటుండ‌గా ఈ పాట కూడా అదే రేంజ్ లో ఉంటుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాను ఆగస్టులో జనాల ముందుకు తీసుకురావడానికి దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

More Related Stories