English   

చ‌ర‌ణ్ ద‌ర్శ‌కుల‌పై సుకుమార్ సెటైర్.. 

Sukumar-Charan

రామ్ చ‌ర‌ణ్ కెరీర్ మొద‌లై ప‌దేళ్లైంది. ఇన్నేళ్ల‌లో ఆయ‌న చేసిన సినిమాల‌న్నీ ప్రేక్ష‌కుల‌కు తెలుసు. అందులో కొన్ని సినిమాలు విజ‌యం కూడా సాధించాయి. మ‌గ‌ధీర అయితే ఇండ‌స్ట్రీ రికార్డుల‌న్నింటినీ క్లీన్ స్వీప్ చేసింది. ఇంత చేసినా కూడా ఏ రోజు కూడా న‌టుడిగా చ‌ర‌ణ్ కోరిన అప్లాజ్ అయితే ప్రేక్ష‌కుల నుంచి రాలేదు. ఇన్నాళ్ల త‌ర్వాత సుకుమార్ పుణ్య‌మా అని రంగ‌స్థ‌లంతో వ‌చ్చింది. అయితే ఈ చిత్ర థ్యాంక్స్ మీట్ లో సుకుమార్ మాట‌లు మిగిలిన ద‌ర్శ‌కుల‌కు చుర‌క‌ల్లా త‌గిలాయి. ఇన్నాళ్లూ రామ్ చ‌ర‌ణ్ కారెక్ట‌రైజేష‌న్ ను ఏ ద‌ర్శ‌కుడు వాడుకోలేద‌ని చెప్పాడు సుకుమార్. ఈ హీరోను కారెక్ట‌రైజేష‌న్ ప‌రంగా ఒక్క ద‌ర్శ‌కుడు కూడా ప్లాన్ చేయ‌లేద‌ని.. ఎంత‌సేపు ఇమేజ్ చుట్టూనే క‌థ‌లు అల్లార‌ని చెప్పుకొచ్చాడు. ఓ ర‌కంగా చ‌ర‌ణ్ ఇన్నాళ్ళూ న‌టుడిగా అక్క‌డే ఉండిపోవ‌డానికి అత‌డితో ప‌ని చేసిన ద‌ర్శ‌కులే అని ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేసాడు సుకుమార్. వాళ్లు కానీ  చ‌ర‌ణ్ లోని న‌టున్ని అప్పుడే చేసి.. అత‌డి కారెక్ట‌రైజేష‌న్ కు త‌గ్గ‌ట్లుగా క‌థ‌లు రాసుంటే ఈ పాటికి చ‌ర‌ణ్ ఓ సూప‌ర్ స్టార్ అయ్యేవాడ‌ని.. న‌టుడిగా త‌న రేంజ్ అద‌ని చెప్పాడు సుకుమార్. కానీ అలా జ‌ర‌గ‌లేదు అందుకే ఇప్ప‌టికీ చ‌ర‌ణ్ లోని నటుడు అక్క‌డే ఉన్నాడు. ఇప్పుడు రంగ‌స్థ‌లంతో త‌న న‌ట‌నను చూసి అంతా షాక్ అవుతున్నారు కానీ తాను అవ్వ‌లేద‌ని చెప్పాడు సుకుమార్. ఎందుకంటే తాను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని ముందే తాను చెప్పాన‌ని గుర్తు చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. నిజ‌మేగా.. ఇన్నాళ్లూ క‌థ‌లు లేక చ‌ర‌ణ్ కూడా యాక్ట్ చేయ‌డం మ‌రిచిపోయాడు. ఒక్క‌సారి త‌న‌కు న‌చ్చిన క‌థ దొరికితే చ‌ర‌ణ్ ఎలా రెచ్చిపోతాడో ఇప్పుడు రంగ‌స్థ‌లం చూసిన త‌ర్వాత అంద‌రికీ అర్థ‌మైపోతుంది. 

More Related Stories