English   

సుమంత్ కు మళ్ళీ అది వస్తుందా..?

Sumanth Idam Jagath Teaser Will Out in Few Hours
2018-08-21 09:46:33

మళ్లీ రావా తర్వాత రూట్ మార్చిన హీరో సుమంత్. ఒకప్పుడు యాక్షన్ సినిమాలతో మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ కావాలని ప్రయత్నించి మొత్తంగా లాస్ అయిన సుమంత్.. ఆ దెబ్బకు చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇక ఈయేడాది వచ్చిన మళ్లీరావా అతనికి కొత్త బ్రేక్ ఇచ్చింది. దీంతో ఇకపై కాన్సెప్ట్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ తోనే రావాలని డిసైడ్ అయ్యాడు. అందుకే కొత్త దర్శకులకు, కొత్త కథలకు ఓకే చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో సుమంత్ చేసిన కొత్త సినిమా ‘‘ఇదం జగత్’’. అనిల్ శ్రీకంఠం అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈసినిమా టీజర్ ఈ నెల 21న విడుదల కాబోతోంది.

కొన్నాళ్ల క్రితం ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అప్పటికే సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ట్వీట్ చేశాడు సుమంత్. షూటింగ్ పూర్తి కావడం అంటే చిన్న మేటర్ కాదు. అయినా ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి నటీనటుల్లో సుమంత్ తప్ప మరొకరిని రివీల్ చేయలేదు. ఇది కొంత ఆశ్చర్యపరుస్తున్నా.. టీమ్ దీన్నో ప్రమోషనల్ సెక్షన్ లో వాడుకుంటుందేమో అనిపిస్తోంది.

ఇక ఈ సినిమాలో సుమంత్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నటిస్తున్నట్టు మాత్రం తెలుస్తుంది. అతను ఓ మర్డర్ కేస్ ను ఇన్వెస్టిగేట్ చేస్తూ వెళతాడు. ఆ క్రమంలో అతనికి ఎదురైన సంఘటనలే ప్రధానాంశంగా రూపొందుతోన్న సినిమా ఇది. అయితే టైటిల్ ను బట్టి హీరో కానీ.. లేదా కథలో మరో ఇంపార్టెంట్ పాత్రలు కానీ పూర్తిగా స్వార్థంతో నిండి ఉండాలి. మామూలుగా మనం ‘ధనమూలం ఇదం జగత్’ అంటుంటాం కదా.. ఆ క్రమంలో ధనం మాత్రం ఇందులో కనిపించడం లేదు.. కానీ స్వార్థమే ఫైనల్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. మరి అది ఎవరి విషయంలో ఎవరికి ఉంటుందనేది ఇంట్రెస్టింగ్ మేటర్ గానే చెప్పాలి. మొత్తంగా ఈ 21న విడుదల కాబోతోన్న టీజర్ తో సుమంత్ కొత్తగా ఏం చెబుతాడా అనేది చూడాలి. సుమంత్ కు మళ్ళీ రావా లాంటి హిట్ రావాలని ఆశిద్దాం.

More Related Stories