English   

ఆగస్టులో సుమంత్  ఇదం జగత్ విడుదల 

idamjagath
2018-07-18 22:25:30

విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న కథానాయకుడు సుమంత్ నటిస్తున్న ఓ వైవిధ్యమైన    చిత్రం ఇదం జగత్ ఈ చిత్రం ద్వారా అంజు కురియన్ నాయికగా పరిచయమవుతుంది. విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ  సుమంత్ ఈ చిత్రంలో  కెరీర్‌లో ఇప్పటి వరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని విభిన్నమైన ఆ పాత్ర ఆడియన్స్‌కు థ్రిల్ల్‌ను కలిగిస్తుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తొలిసారిగా సుమంత్ నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో ఆడియన్స్‌ను సర్‌ఫ్రైజ్ చేయ్యబోతున్నాడు. సుమంత్ పాత్ర, కథకు ఇదం జగత్ అనే టైటిల్ యాప్ట్‌గా వుంటుంది. ఈ పాత్ర చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. కొత్తదనం కోరుకునే ఆడియన్స్ ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఆగస్టు ద్వితీయార్థంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.  

More Related Stories