English   

సుమంత్.. మ‌ళ్లీ చేస్తున్నావా..? 

Sumanth-new-movie

మ‌ళ్లీరావా.. గ‌తేడాది వ‌చ్చిన మంచి సినిమాల్లో ఇది కూడా ఒక‌టి. సుమంత్ హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని గౌత‌మ్ తిన్న‌నూరి తెర‌కెక్కించాడు. ఈ చిత్రంతో చాలా ఏళ్ల త‌ర్వాత నేనున్నాన‌ని నిరూపించుకున్నాడు సుమంత్. క‌మ‌ర్షియ‌ల్ గా మ‌ళ్లీరావా ఫెయిల్యూర్ అయ్యుండొచ్చు కానీ సుమంత్ కెరీర్ కు మాత్రం ఈ సినిమా ఊపిరే. ఈ సినిమాతో ఇప్పుడు సుమంత్ చేస్తోన్న సినిమాపై కొద్దోగొప్పో ఆస‌క్తి మొద‌లైంది. ఇన్నేళ్లైనా హీరోగా క‌నీస గుర్తింపు తెచ్చుకోలేక‌పోయాడు సుమంత్. అయినా కూడా త‌న ప్ర‌య‌త్నాలు మాత్రం ఆప‌డం లేదు. ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డాలంటే బ్యాగ్రౌండ్ మాత్ర‌మే ఉంటే స‌రిపోదు.. అదృష్టం కూడా క‌లిసి రావాలి. అలా క‌లిసిరాకే ఇప్ప‌టికీ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు సుమంత్. వార‌స‌త్వం, టాలెంట్ రెండూ ఉన్నా.. అదృష్టం లేక స్టార్ స్టేట‌స్ కు దూరంగా ఉన్న హీరో సుమంత్. అక్కినేని కుటుంబ బ్యాగ్రౌండ్ ఉంది.. పైగా చూడ్డానికి బాగుంటాడు.. అన్నింటికి మించి న‌టుడు కూడా.. ఇన్ని ఉన్నా కూడా సుమంత్ ను ల‌క్ క‌రుణించ‌ట్లేదు. గ‌త 20 ఏళ్లుగా కెరీర్ ను మ‌లుపు తిప్పే స‌రైన స‌క్సెస్ కోసం వేచి చూస్తునే ఉన్నా ఇప్ప‌టికీ త‌గల్లేదు. ఇప్పుడు ఈయ‌న అనిల్ శ్రీ‌కంఠం అనే కొత్త ద‌ర్శ‌కుడితో ఇదం జ‌గ‌త్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. గ‌చ్చిబౌలిలో తాజా షెడ్యూల్ చేస్తున్నారు. ఈ చిత్రం మే లో విడుద‌ల కానుంది. మ‌ళ్లీరావాతో నేనున్నానంటూ గుర్తుచేసిన సుమంత్.. ఈ సినిమాతో హిట్ కొడ‌తాడేమో చూడాలిక‌..!

More Related Stories