English   

సుమంత్ సుబ్రహ్మణ్యం పురం ఎందుకెళ్లాడు..?

sumanth

మళ్లీ రావా తర్వాత కొత్త తరహా కథలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు సుమంత్. దశాబ్ధం పాటు ప్రయత్నంచినా.. హీరోగా స్టార్డమ్ తెచ్చుకోలేకపోయిన సుమంత్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అనదగ్గ టర్న్ తీసుకున్నాడు. వైవిధ్యమైన కథలకు కమిట్ అవుతూ.. మళ్లీ హీరోలు, సాంగ్స్ ఫైట్స్ అనే రొటీన్ రూట్ లో కాకుండా కథాబలం ఉన్న సినిమాలు ఒప్పుకుంటున్నాడు. రీసెంట్ గా ఇదం జగత్ అనే సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఆ లుక్ కు మంచి స్పందన వచ్చింది. ఆ ఫస్ట్ లుక్ ను బట్టే ఇది పూర్తిగా కంటెంట్ బేస్డ్ సినిమాగా అర్థమైంది. ఇక ఇక ఇప్పుడు మరో సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు.

సుమంత్ లేటెస్ట్ మూవీ టైటిల్ సుబ్రహ్మణ్య పురం. చూడ్డానికి ఓ మళయాల సినిమా డబ్బింగ్ టైటిల్ లా ఉన్నా.. ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం ముందు నిలబడి అతను దేన్నో వెదుకుతూ ఉన్నట్టుగా ఉన్న ఈ పిక్ ఆట్టుకుంటోంది. సంతోష్ జాగర్లమూడి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తోన్న ఈ సినిమాను ఈ యేడాదే నవంబర్ లో విడుదల చేస్తామని ట్విట్టర్ లో ప్రకటించాడు సుమంత్. మరి ఈ రెండు సినిమాల్లో ఏఒక్కటి హిట్ అయినా సుమంత్ కెరీర్ కొత్త టర్న్ తీసుకుంటుందనేది నిజం. అలాగే ఇలాంటి కంటెంట్ బేస్డ్ కథలకు ఫస్ట్ ఆప్షన్ గానూ మారతాడు. 

More Related Stories