English   

కార్తికేయ సీక్వెల్ లో సుమంత్.. 

sumanth
2018-10-20 14:39:44

అదేంటి.. చేస్తే గీస్తే నిఖిల్ చేయాలి కానీ.. సుమంత్ చేయ‌డం ఏంటి..? అయినా కార్తికేయ 2 తామే చేస్తామ‌ని ద‌ర్శ‌కుడు చందూమొండేటి కూడా ప్ర‌క‌టించాడు క‌దా ఇప్పుడు సుమంత్ ఎలా వ‌చ్చాడు అనుకుంటున్నారా..? వ‌చ్చాడు అంతే.. కొన్ని సినిమాలు చూస్తుంటే తెలియ‌కుండానే మ‌రికొన్ని సినిమాలు గుర్తొస్తుంటాయి. ఇప్పుడు సుమంత్ న‌టిస్తున్న సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం టీజ‌ర్ విడుద‌లైంది. ఇది చూసిన త‌ర్వాత కార్తికేయ సినిమా వ‌ద్ద‌న్నా గుర్తొస్తుంది. టీజ‌ర్ ఆస‌క్తిక‌రంగానే ఉంది. గ‌తంలో సుమంత్ సినిమాల‌తో పోలిస్తే చాలా రీ ఫ్రెషింగ్ గా అనిపిస్తుంది కూడా. సంతోష్ జాగ‌ర్ల‌పూడి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. 

ఇది సుమంత్ కు 25వ సినిమా కావ‌డం విశేషం. ఇవ‌న్నీ ఇలా ఉంటే ఈ చిత్ర టీజ‌ర్ అచ్చు గుద్దిన‌ట్లు నిఖిల్ కార్తికేయ సినిమాను పోలి ఉండ‌ట‌మే ఇప్పుడు అనుమానాలకు తావిస్తుంది. ఓ ఊరు.. ఓ గుడి.. అందులో స‌స్పెన్స్.. ఆ గుడి తెలుసుకోవాల‌నుకునే వాళ్లంతా చ‌చ్చిపోతుంటారు.. సేమ్ టూ సేమ్ కార్తికేయ క‌థ‌లో కూడా ఉంది. ఇదే క‌థ‌ను సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర స్వామి సాక్షిగా తీస్తున్నాడు సుమంత్. ఇప్పుడు సుమంత్ ఏం చేస్తున్నాడో తెలియ‌దు కానీ క‌చ్చితంగా కార్తికేయ పోలిక‌లు మాత్రం బాగానే క‌నిపిస్తున్నాయి. ఈ పోలిక‌లు టీజ‌ర్ వ‌ర‌కు అయితే ఓకే కానీ సినిమా వ‌ర‌కు కూడా కంటిన్యూ అయితే క‌ష్టాలు త‌ప్ప‌వు. న‌వంబ‌ర్ లోనే సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం విడుద‌ల కానుంది. 

More Related Stories