English   

మీడియాను టార్గెట్ చేసిన సుమంత్

Sumanth's Idam Jagath Movie Teaser Talk
2018-08-21 21:23:16

మళ్లీరావాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన హీరో సుమంత్. అతని లేటెస్ట్ మూవీ ‘ఇదం జగత్’. ఈ మూవీ టీజర్ విడుదలైంది. సుమంత్ జర్నలిస్ట్ గా నటిస్తున్నాడు. ఓ కొత్త తరహా పాత్రలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ టీజర్ లో మీడియాపై కొన్ని సెటైర్స్ కూడా వేశాడు. అలాగని అవేమీ డైరెక్ట్ గా టార్గెట్ చేసినట్టుగా లేవు. కాకపోతే ఈ ప్రపంచంలో ప్రతిదీ న్యూసే అంటూ ప్రతి విషయాన్ని చెప్పిన విధానం బావుంది. ఇక్కడ మనిషి చావు న్యూసే, జ్ఞాపకాలూ న్యూసే.. స్నేహం న్యూసే,. ప్రేమా న్యూసే.. అది ఎన్ క్యాష్ చేయడం తెలుసుకోండి.. అవసరమైతే ఆ న్యూస్ క్రియేట్ చేయడం కూడా తెలిసుండాలి.. అది నాకు తెలుసు’’ అంటూ ఇంటెన్సిటీతో సాగిన ఈ టీజర్ లో అతను ఇలాగే కొత్త వార్తలు క్రియేట్ చేసి వాటిని అమ్ముకునే టైప్ జర్నలిస్ట్ పాత్రగా కనిపిస్తోంది. అలాగే అవసరమైతే న్యూస్ క్రియేట్ చేయడం తెలిసుండాలి అంటూ కొన్నాళ్ల క్రితం వచ్చిన అమితాబ్ బచ్చన్ సినిమాను గుర్తు చేశాడు. కాకపోతే ఈ సినిమా ‘నైట్ క్రాలర్’ అనే ఓ హాలీవుడ్ సినిమాను కాపీ కొట్టినట్టుగా కనిపిస్తోంది. అది నిజమా కాదా అనే ప్రశ్న కూడా అవసరం లేదు. మాగ్జిమం టీజర్ అంతా అలాగే ఉంది.

 

కాకపోతే ఈ మధ్య కొత్త తరహా కథలకు మంచి బిజినెస్ ఉంది. అందుకే సుమంత్ కూడా ఈ టైప్ స్టోరీస్ కు ఓకే చెబుతున్నాడు. చూస్తుంటే అతని డెసిషన్ కరెక్టే అనిపిస్తోంది కూడా. ఇక అనిల్ శ్రీకంఠం డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో అంజు కురియన్ హీరోయిన్ గా నటిస్తోంది. మాగ్జిమం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది.

More Related Stories