English   

అల్లున్ని కాపాడేవాళ్లే లేరా..?

sundeep kishan 1
2018-02-19 14:09:34

అల్లుడు అంటే ఎవ‌రా అనుకుంటున్నారా..? ఇండ‌స్ట్రీలో ఈ మ‌ధ్య అల్లుళ్ళ బెడ‌ద ఎక్కువైపోయింది. ఆ బంచ్ లోనే మ‌రో అల్లుడు సందీప్ కిష‌న్. ఈయ‌న ఛోటా కే నాయుడుకు మేన‌ల్లుడు. మామా టాప్ సినిమాటోగ్ర‌ఫ‌ర్ అయినా కూడా ఆయ‌న పేరు వాడుకోకుండానే ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు. అంద‌రు న‌టుల్లాగే తను కూడా అవ‌కాశాల కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాడు. వ‌చ్చాడు.. నిలిచాడు.. కానీ గెల‌వ‌డ‌మే మ‌రిచిపోతున్నాడు ఈ కుర్ర హీరో. వ‌చ్చిన సినిమాలు వ‌చ్చిన‌ట్లే పోతున్నాయి కానీ ఒక్క‌టి కూడా నిల‌బ‌డ‌టం లేదు. ఇప్పుడు వ‌చ్చిన మ‌న‌సుకు న‌చ్చింది కూడా ఎవ‌రి మ‌న‌సుకు న‌చ్చ‌డం లేదు. అస‌లు క‌థంటూ లేకుండా చేస్తోన్న సినిమాల‌తో సందీప్ కు ఉన్న ఇమేజ్ కూడా పోతుంది. అప్పుడెప్పుడో కెరీర్ మొద‌ట్లో ర‌కుల్ తో న‌టించిన వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో హిట్ లేదు ఈ కుర్రాడికి. దాంతో అర్జంట్ గా ఓ హిట్ కొట్ట‌క‌పోతే ఈ కుర్ర హీరో ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డ‌టం క‌ష్టంగానే క‌నిపిస్తుంది. త‌మిళ‌నాట కూడా ఆఫ‌ర్లు బాగానే వ‌స్తున్నా.. ఇప్పుడు మ‌నోడి చూపు తెలుగు ఇండ‌స్ట్రీ పైనే ఉంది. మ‌రి చూడాలిక‌.. ఈ అల్లున్ని కాపాడే ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో..? 

More Related Stories