English   

A1 ఎక్స్‌ప్రెస్ అవుట్‌పుట్‌ చూసుకున్నాక టీమ్ అందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి: హీరో  సందీప్ కిషన్ 

 Sundeep Kishan
2021-03-04 18:45:30

యూత్ హీరో సందీప్ కిషన్ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లుపై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం సంయుక్తంగా నిర్మించిన చిత్రం "A1 ఎక్స్ ప్రెస్". ఇండియన్ నేషనల్ గేమ్ హాకీ స్పోర్ట్స్ బాక్డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రానికి హిప్ హాప్ త‌మిళ‌ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం మార్చి 5న అత్యధిక థియేటర్స్ లలో గ్రాండ్ గా విడుదలవుతోంది. 

ఈ సందర్బంగా చిత్ర బృందం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్, దర్శకుడు డెన్నిస్ జీవన్ కనుకొలను, నిర్మాతలు వివేక్ కూచిభొట్ల, అభిషేక్ అగర్వాల్, దయా పన్నెం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివ, కెమెరామెన్ కమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.. 

చిత్ర దర్శకుడు డెన్నిస్ జీవన్ కనుకొలను మాట్లాడుతూ.. "డే వన్ నుండి మా టీమ్ అంతా 200% పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసిన సినిమా ఇది. 14 మంది న్యూ టెక్నీషియన్స్ ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. బిగ్ స్కేల్ లో తెరకెక్కిన న్యూ ఏజ్ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్ ఇది. ఇలాంటి మూవీ డైరెక్షన్ చేసే ఛాన్స్ ఇచ్చిన మా నిర్మాతలకు, హీరో సందీప్ కిషన్ కు థాంక్స్. ఒక గేమ్ ఆడేటప్పుడు వాళ్లలో టాలెంట్ వున్న వారిని ఎంకరేజ్ చేయాలి తప్పితే.. డబ్బు ఉన్నోడి పాకెట్ లో కాదు.. అనే విష‌యాన్ని ఈ చిత్రంలో చూపించాం. అన్ని ఎమోషన్స్ వున్న చిత్రమిది. ప్రతిదీ ఆర్గానిక్ గా సెట్ అయ్యాయి. ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్ ఆడియెన్స్ కి కలుగుతుంది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సీన్స్ చాలా వున్నాయి" అన్నారు. 

More Related Stories