English   

సునిల్, అల్లరి నరేష్ సిల్లీ ఫెలోస్..

sunil and narsh as silly fellows
2018-06-08 17:14:23

కమెడియన్ నుంచి హీరోగా మారి ఇప్పుడు మళ్లీ కామెడీకే యూ టర్న్ తీసుకున్న సునిల్.. కామెడీ హీరోగా కంటిన్యూస్ ఫ్లాప్స్ చూస్తోన్న అల్లరి నరేష్ ఇద్దర్నీ సిల్లీ ఫెలోస్ గా మార్చాడో సీనియర్ డైరెక్టర్. అంటే ఇదేమీ నెగెటివ్ సెన్స్ కాదులెండి.. ఇప్పుడు సునిల్, నరేష్ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకే ‘సిల్లీ ఫెలోస్’ అనే టైటిల్ పెట్టారు. రీమేక్ సినిమాలు తీయడంలోఎక్స్ పర్ట్ అయిన భీమనేని శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.  ఈ లుక్ ట్వీట్ చేసిన అల్లరి నరేష్ .. ఓల్డ్ స్కూల్ స్టైల్ లో ఈ సారి మిమ్మల్ని హిలేరియస్ గా నవ్వించడానికి వస్తున్నాని చెప్పాడు.  చిత్ర శుక్లా హీరోయిన్ గా నటిస్తోందీ సినిమాలో. మరి మరో హీరోయిన్ కూడా ఉంటుందా లేదా అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. 

ప్రస్తుతం నరేష్, సునిల్ ఇద్దరికీ మంచి హిట్ కావాలి. అలాగే దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు కు కూడా. అందుకే ఈ ముగ్గురి కాంబినేషన్ లో వస్తోన్న సిల్లీ ఫెలోస్ పై అంచనాలుంటాయి. ఇక సునిల్ మళ్లీ కమెడియన్ గా యూ టర్న్ తీసుకున్న తర్వాత చేసిని సినిమా ఇది. మరి ఓల్డ్ స్కూల్ లో ఉంటాడా లేక మళ్లీ హీరో తాలూకూ స్మెల్ చూపుతాడా అనేది కూడా కీలకంగా ఉంటుంది. మొత్తంగా ఈ సిల్లీ ఫెలోస్ ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్నారనే చెప్పాలి. 

More Related Stories