English   

న‌రేష్.. సునీల్.. ఇద్ద‌రూ సిల్లీఫెల్లోస్.. 

sunil-naresh
2018-03-20 15:48:19

సిల్లీఫెల్లో.. ఈ మాట విన‌గానే ముందుగా మ‌న‌కు గుర్తొచ్చేది మోహ‌న్ బాబు. ఆయ‌నే అంద‌ర్నీ సిల్లీఫెల్లో అంటుంటాడు. ఇప్పుడు ఇదే సినిమా టైటిల్ గా మారిపోతుంది. సిల్లీఫెల్లో కాదు.. ఏకంగా ఫెల్లోస్ వ‌స్తున్నారిప్పుడు. వాళ్ళెవ‌రో కాదు అల్ల‌రి న‌రేష్ అండ్ సునీల్. ఈ ఇద్ద‌రూ హీరోలుగా ఇప్పుడు భీమినేని శ్రీ‌నివాస‌రావ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇది త‌మిళ ప‌డ‌మ్ 2 కు రీమేక్ అని తెలుస్తుంది. ఒక‌ప్పుడు సుడిగాడుతో న‌రేష్ ఇమేజ్ అలా పెంచేసిన ఈ ద‌ర్శ‌కుడు.. ఇప్పుడు మ‌రోసారి ఆయ‌న‌కు హిట్ ఇవ్వాల‌ని చూస్తున్నాడు. సుడిగాడు త‌ర్వాత ఇటు న‌రేష్.. అటు భీమినేనికి హిట్లు లేవు. దాంతో ఇద్ద‌రి కెరీర్స్ కు సిల్లీఫెల్లోస్ కీల‌కంగా మారింది. మ‌రోవైపు సునీల్ కూడా ఇప్పుడు ఎటూ కాని ప‌రిస్థితుల్లో ఉన్నాడు. ఈయ‌న హీరోగా డిజాస్ట‌ర్ అయిపోయాడిప్పుడు. కొన్నేళ్లుగా సునీల్ సినిమాలు వ‌చ్చిన‌ట్లు కూడా ప్రేక్ష‌కుల‌కు తెలియ‌డం లేదు. ఇలాంటి టైమ్ లో ఈయ‌న త‌ప్ప మ‌రోసారి క‌మెడియ‌న్ గా మారిపోతున్నాడు. ఇలా మారిన త‌ర్వాత న‌రేష్ తో క‌లిసి న‌టిస్తున్నాడు సునీల్. మ‌రి ఈ సిల్లీఫెల్లోస్ ఇద్ద‌రూ క‌లిసి ఏం మాయ చేస్తారో చూడాలిక‌. ఇదే ఏడాది ఈ చిత్రం విడుద‌ల కానుంది.

More Related Stories