English   

సునీల్ కు ఊహించిన ఆహ్వానం..

Comedian-sunil
2018-03-10 15:08:39

ప‌దేళ్ళ త‌ర్వాత అమ్మాయి పుట్టింటికి వ‌స్తే ఎలా ఆహ్వానిస్తారు.. ఇప్పుడు సునీల్ ను కూడా మ‌న ద‌ర్శ‌కులు అలాగే ఆహ్వానిస్తున్నారు. ఆ మ‌ధ్య హీరోగా సినిమాలు చేసిన ఈ హీరో ఇప్పుడు మ‌ళ్లీ క‌మెడియ‌న్ అవుతున్నాడు. ఇప్ప‌టికే వ‌ర‌స‌గా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. హీరోగా ఇక చాలు అనుకుంటున్నాడు ఈ భీమ‌వ‌రం బుల్లోడు. దేన్నైనా తెగేవ‌ర‌కు లాగ‌కూడ‌దు. ఇప్పుడు సునీల్ చేస్తున్న‌ది కూడా ఇదే. ఇక నువ్వాప‌రా బాబూ అనేవ‌ర‌కు తెచ్చుకుంటే.. క‌మెడియ‌న్ గా చేసినా కూడా చూడ‌రు. అందుకే ముందు జాగ్ర‌త్త‌తో అవి మానేసి కామెడీ వైపు అడుగేసాడు. ఈయ‌న సెకండ్ ఇన్నింగ్స్ అదిరిపోయేలా క‌నిపిస్తుంది. అవును.. 20 ఏళ్ల కెరీర్ లో సునీల్ కు ఎన్న‌డూ లేని విధంగా నెక్ట్స్ ఏంటి అనే ప్ర‌శ్న కూడా వ‌చ్చింది. ఓ సినిమా పూర్త‌య్యే లోపు మ‌రో రెండు మూడు లైన్ లో ఉండేవి. హీరో అయ్యాక‌ కూడా సునీల్ కు ఈ టైమ్ న‌డిచింది. కానీ ఇప్పుడు పూర్త‌యిన‌ట్లుంది.
 
మొన్నొచ్చిన 2 కంట్రీస్ కూడా వ‌చ్చి వెళ్లిన‌ట్లు కూడా చాలా మందికి తెలియ‌దు. అందుకే క‌మెడియ‌న్ గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు సునీల్. ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ సినిమానే త‌న రీ ఎంట్రీకి స‌రైన సినిమా అని భావిస్తున్నాడు ఈ భీమ‌వ‌రం బుల్లోడు. పైగా స్నేహితుడే కావ‌డంతో సునీల్ కోసం మంచి కామెడీ రోల్ రాస్తున్నాడు త్రివిక్ర‌మ్. దానికి త‌గ్గ‌ట్లే ఇప్పుడు మున‌ప‌టి రూపంలోకి మారిపోతున్నాడు సునీల్. ఇక శీనువైట్ల‌-ర‌వితేజ సినిమాలోనూ న‌టిస్తున్నాడు సునీల్. ఈ విష‌యం ద‌ర్శ‌కుడు కూడా క‌న్ఫ‌ర్మ్ చేసాడు. దాంతో పాటు అల్ల‌రినరేష్-భీమినేని శ్రీ‌నివాస‌రావు సినిమాలోనూ న‌టిస్తున్నాడు ఈ భీమ‌వ‌రం బుల్లోడు. సైరా లోనూ ఓ పాత్ర కోసం అడిగారంటూ అప్ప‌ట్లో చెప్పాడు సునీల్. ఇలా ఈయన కామెడీ ప్ర‌యాణం ఇప్పుడు చాలా బాగుంది. 

More Related Stories