English   

సింగర్ సునిత మళ్లీ పెళ్లి చేసుకుందా..?

singer sunitha
2018-07-19 21:58:44

ఏంటో ఈ మధ్య సెలబ్రిటీల సెకండ్ మ్యారేజ్ న్యూస్ తో ఫిలిమ్ ఇండస్ట్రీస్ అన్నీ హాట్ హాట్ గా మారాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ రెండో పెళ్లికి సిద్ధమైంది. ఇప్పుడు టాలీవుడ్ స్వీట్ సింగర్ సునిత కూడా సెకండ్ మ్యారేజ్ కు రెడీ అయిందనే వార్త టాలీవుడ్ లో హల్చల్ చేస్తోంది. నిజానికి గతంలో సునిత తనకు రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టంగా చెప్పింది. కానీ ఇప్పుడీ వార్త మాత్రం విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది. అయినా తన పెళ్లి వార్తలను సునిత ఇంత వరకూ ఖండించలేదు. దీంతో ఈ రూమర్స్ కు మరింత బలం వస్తోంది. మరి నిజంగానే సునిత మళ్లీ పెళ్లి చేసుకుంటోందా..?

సునితకు 19యేళ్ల వయసులోనే పెళ్లైంది. పాతికేళ్లకే ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ ఇద్దరూ ఇప్పుడు డిగ్రీ చదువుల్లో ఉన్నారు. అయితే పెల్లలు పుట్టిన తర్వాతతో విభేదాలు వచ్చి.. తను వేరుగా ఉంటోందిప్పుడు. గతంలో ఓ రాజకీయ వేత్తతో తనకు ఏదో ఉందనే రూమర్స్ కూడా వచ్చాయి. తర్వాత వాటిని ‘ఆ ఇద్దరూ’ ఖండించారు. తర్వాత మళ్లీ ఆ వార్తలు రాలేదు. కానీ ఇప్పుడు పెళ్లి విషయం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సునిత నాలుగు పదుల వయసులో ఉంది. ఈ టైమ్ లో పెళ్లి మహిళకు మానసికంగా మరింత స్థైర్యాన్నిస్తుంది. ఇన్నాళ్లూ ఎలాగోలా ఉన్నా.. వయసు పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఓ తోడు అవసరం. మరి బాలీవుడ్ ను చూసి ఇన్స్ స్పైర్ అయిందో లేక.. రేణూదేశాయ్ ని ఆదర్శంగా తీసుకుందో కానీ తను సెకండ్ మ్యారేజ్ కు సిద్ధమైందంటున్నారు. ఇదే నిజమైతే ఆ వ్యక్తి ఎవరు..? అతని నేపథ్యం ఏంటీ..? ఎలాంటి పరిస్థితుల మధ్య ఈ పెళ్లి జరగబతోంది. అంటే లవ్ మ్యారేజ్ లేదా అరేంజ్డ్ మ్యారేజ్..? ఇలా చాలా ప్రశ్నలున్నాయి. ఈ పెళ్లి నిజమైతే వీటికి సునిత ఏం చెబుతుందో..? లేదంటే ఈ రూమర్స్ కు ఎలా చెక్ పెడుతుందనేది ఆసక్తిగా మారింది.  

More Related Stories