English   

సన్నిలియోన్ కు ఇద్దరు అబ్బాయిలు

sunny leone family

సన్నిలియోన్ ఫ్యామిలీ పెద్దదవుతోంది. ఇప్పటికే భర్త వెబర్ తో కలిసి ఓ పాపను దత్తత తీసుకున్న సన్నీ లేటెస్ట్ గా మరో ఇద్దరు బేబీ బాయ్స్ ను అడాప్ట్ చేసుకుంది. ఇప్పుడు తన ఫ్యామిలీ పెద్దగా మారిందని.. దేవుడు తనకు ఇచ్చిన ఈ కుటుబం చూస్తే తనకెంతో ఆనందంగా ఉందని ఐదుగురూ కలిసి ఉన్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది సన్నిలియోన్. గతేడాది జూన్ లో ఓ మహరాష్ట్రలోని ఓ గ్రామం నుంచి ఓ పాపను దత్తత తీసుకుంది సన్ని.ఆ పాపకు నిషా కౌర్ వెబర్ అనే పేరు పెట్టుకుంది. ఆ టైమ్ లో కొన్ని వివాదాలు వచ్చినా.. అన్నిటినీ సెటిల్ చేసుకుంది. ఆ పాపను దంపతులిద్దరూ అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా మరో ఇద్దరు అబ్బాయిల్ని దత్తత తీసుకుందీ జంట. ఆ ఇద్దరికీ ఆశా సింగ్ వెబర్, నోవా సింగ్ వెబర్ అనే పేర్లు పెట్టేసుకున్నారు. ఈ ముగ్గురితో ఇప్పుడు తనది కంప్లీట్ ఫ్యామిలీగా కనిపిస్తోందంటూ మురిసిపోతూ చెప్పుకుంటోంది సన్నిలియోన్.. తన గత ఇమేజ్ ను దాటుకుని, బాలీవుడ్ లో సెటిల్ అవుతూ.. పాత జ్ఞాపకాల్ని మర్చిపోవడానికి కొత్త సినిమాలు చేస్తూ.. తనలోని మానవత్వాన్ని ప్రదర్శించుకుంటోన్న సన్నిలియోన్ నిజంగానే హార్ట్ ఫుల్ లేడీ. హ్యాట్సాఫ్ సన్నీ.. 

More Related Stories