English   

స‌న్నీ బ‌యోపిక్.. అంతా అదే..!!

sunnyleone

మ‌న‌కెప్పుడూ మ‌న లైఫ్ కంటే ప‌క్క‌వాళ్ల లైఫ్ లో ఏం జ‌రుగుతుంది అని తెలుసుకోడానికే ఎక్కువ ఆస‌క్తి ఉంటుంది. ఇదే నిజం కూడా. మ‌న లైఫ్ మ‌న‌కు ఎప్పుడూ బోర్. అదే ప‌క్క వాళ్ల జీవితంలో జ‌రుగుతున్న సంగతులు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్. అందుకే ఇండియాలోనే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా బ‌యోపిక్ ల‌కు అంత డిమాండ్ ఉంటుంది. బాలీవుడ్ లో అయితే మ‌రీను. అక్క‌డ బ‌యోపిక్ ల కోస‌మే ద‌ర్శ‌కులు వెతుకుతుంటారు. క‌థ‌లు రాయ‌డం పూర్తిగా మానేసి.. జీవితాలు చ‌దివేస్తున్నారు. ఇప్పుడు మ‌రో బ‌యోపిక్ కూడా రానుంది. అదే స‌న్నీలియోన్ బ‌యోపిక్ క‌ర‌ణ్ జీత్. ఈ పేరు ఎందుకు పెట్టార‌నుకోవ‌చ్చు. స‌న్నీ అస‌లు పేరు క‌ర‌ణ్ జీత్ కాబ‌ట్టి దానికి ఆ పేరు పెట్టారు. స‌న్నీలియోన్ ను ఇండియాలో శృంగార దేవ‌త‌గా అభిమానిస్తున్నారు.

ఈమె ఉంటే చాలు త‌మ సినిమాల‌కు కాసులు ఖాయం అనే న‌మ్మ‌కంతో ఉంటున్నారు నిర్మాత‌లు. ఇంత ఫేమ‌స్ ప‌ర్సినాలిటీ జీవితం గురించి తెలుసుకోవాల‌ని ఎవ‌రికి మాత్రం ఉండ‌దు చెప్పండి.. ఈ ఎగ్జైట్ మెంట్ ను క్యాష్ చేసుకోడానికి ఇప్పుడు స‌న్నీలియోన్ జీవితాన్ని తీసుకొచ్చి నెట్టింట్లో పెట్ట‌నున్నారు. క‌ర‌ణ్ జీత్ అనే పేరుతో ఓ వెబ్ సిరీస్ తెర‌కెక్క‌నుందిప్పుడు. భారీ బ‌డ్జెట్ తోనే ఈ వెబ్ సిరీస్ చేస్తున్నారు. జీ 5లో ఇది ప్ర‌సారం కానుంది. త‌న జీవితంలోని అతి ముఖ్య‌మైన విష‌యాల‌ను తెలుసుకోవాల‌న్నా.. తాను కెన‌డా నుంచి ఇండియాకు ఎందుకు వ‌చ్చానో తెలుసుకోవాల‌నుకున్నా కూడా క‌ర‌ణ్ జీత్ వెబ్ సిరీస్ చూడండంటూ స‌న్నీనే త‌న వెబ్ సిరీస్ ను ప్ర‌మోట్ చేస్తుంది. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులో స‌న్నీ ప‌డిన క‌ష్టాల‌ను బాగానే ఫోక‌స్ చేసారు.. అదే విధంగా అందాల ఆర‌బోత‌ని కూడా.  ఇదే ఈ వెబ్ సిరీస్ కు ఫుల్లుగా డ‌బ్బులు తీసుకొచ్చేలా క‌నిపిస్తుంది.
 

More Related Stories