English   

సర్కారు వారి పాట రెండో షెడ్యూల్ ప్రారంభం

Mahesh
2021-04-13 15:54:32

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్, జిఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్ లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభిస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ వెల్లడించింది. అంతే కాకుండా ఈ షెడ్యూల్ మహేష్ బాబు కూడా పాల్గొంటారని తెలిపింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ లో పాల్గొంటామని వెల్లడించింది. ఇక ఇప్పటికే సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నారు. ఫస్ట్ షెడ్యూల్ ను దుబాయ్ లో పూర్తి చేశారు. అక్కడ యాక్షన్ అండ్ రొమాంటిక్ సీన్లను తెరకెక్కించినట్టు సమాచారం.  మరోవైపు రెండో షెడ్యూల్ ను ఈ నెలాఖరికి పూర్తి చేసి ప్రధాన షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ యూరప్ వెళ్ళనుంది.

More Related Stories