English   

22 ఏళ్ళ త‌ర్వాత ప‌వ‌న్ హీరోయిన్.. 

Supriya
2018-07-19 15:11:20

సుప్రియ గుర్తుందా..? ఇంత‌కీ ఎవ‌రీ సుప్రియ అనుకుంటున్నారా..? అంత ఈజీగా గుర్తు రావ‌డానికి ఆమె చేసింది ప‌ది సినిమాలు కాదు.. ఒకేఒక్క సినిమా. అది కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలి సినిమా అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి. ఈ చిత్రంలో ప‌వ‌న్ తో జోడీక‌ట్టిన అక్కినేని వార‌మ్మాయి సుప్రియ గుర్తుంది క‌దా..! అప్ప‌ట్లో తాత న‌ట వార‌స‌త్వాన్ని తీసుకుని న‌టించినా కూడా ఆ త‌ర్వాత ఎందుకో కానీ న‌ట‌న‌పై ఆస‌క్తి త‌గ్గించేసి ప్రొడ‌క్ష‌న్ వైపు అడుగేసింది సుప్రియ‌. ఒక్క సినిమాతోనే న‌ట‌న‌కు దూరంగా ఉన్నా ఇండ‌స్ట్రీకి మాత్రం ద‌గ్గ‌రగానే ఉంది. అయితే 22 ఏళ్ల త‌ర్వాత ఈమెకు మ‌ళ్లీ న‌ట‌న‌పై ఆస‌క్తి క‌లిగింది. కార‌ణం తెలియ‌దు కానీ అడవిశేష్ గూడాఛారి సినిమాలో కీల‌క‌పాత్ర‌లో న‌టించింది సుప్రియ‌. నాగార్జున మేన‌కోడ‌లు ఈ చిత్రంలో ముఖ్య‌పాత్ర‌లో న‌టించింద‌ని.. అది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని తెలుస్తుంది. ఇన్నేళ్ళ త‌ర్వాత వ‌స్తున్నా కూడా న‌ట‌న‌తో మాత్రం ఆక‌ట్టు కునేలా క‌నిపిస్తుంది సుప్రియ‌. ఈ సినిమా త‌ర్వాత న‌ట‌న కంటిన్యూ చేస్తుందో లేదో తెలియ‌దు కానీ చేస్తే మాత్రం తెలుగు తెర‌కు మ‌రో మంచి కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ దొరికేసిన‌ట్టే..!

More Related Stories