English   

సినిమాల్లోకి సురేఖా వాణి కూతురు

Surekhavani
2020-05-26 12:29:50

తెలుగు సినిమాల్లో ఆమె చేసింది మంచి పాత్రలే, అంటే ఎటువంటి అసభ్యానికి తావు లేకుండా ఉండే తల్లి, చెల్లి, అక్క, వదిన పాత్రలే ఆమె చేసేది. భర్త పోయాక సినిమా అవకాశాలు తగ్గాయో, లేక ఆమెనే తగ్గించుకుందో కానీ సినిమాలు అయితే చేయడం లేదు. కానీ టిక్ టాక్ పుణ్యమా అని ఇప్పటిదాకా ఉన్న హోమ్లీ ఇమేజ్ ని దూరం చేసుకోడానికి ప్రయత్నిస్తోంది ఒక నటి. ఆమె గురించి ఇప్పటికే మీకు అర్ధం అయి ఉంటుంది. ఆమే సురేఖా వాణి. అవును ఈమె ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ లా మారింది. దానికి కారణం ఆమె చేస్తున్న టిక్ టాక్ వీడియోలే. ఈ మధ్య ఆమె చేస్తున్న వీడియోలు అప్లోడ్ చేస్తున్న పిక్స్ లో కాస్త హాట్నెస్ డోస్ ఎక్కువ కావడమే దానికి కారణం. ఈ మధ్యన ఆమె తన కూతురు సుప్రీతతో కలిసి ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి చూసిన నెటిజన్లలో అధిక భాగం మీద ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సురేఖాతో పాటు ఆమె కూతురు చిట్టి, పొట్టి డ్రస్సులు దిగి ఫొటోలకు ఫోజులివ్వడాన్ని కొందరు తప్పుబట్టడమే కాకుండా కామెంట్ల రూపంలో ఆ విషయాన్ని బహిర్గతంగానే తిట్టారు. అయితే ఆ విషయం పక్కన పెడితే ఆ మధ్య ఆమె కూతురు సుప్రీత హీరోయిన్ గా సినిమా రాబోతుందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ విషయంపై సురేఖా వాణి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే చాలా మంది నట వారసురాలుగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈమె కూడా సినిమాల్లో నటించాలని అనుకుంటున్నట్టు చెబుతున్నారు.  ఇక సుప్రీత ప్రస్తుతం చదువుకుంటునే సినీ రంగం వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆమె నటించిన కొన్ని వెబ్ సీరీస్ కూడా యూట్యూబ్ లో ఉన్నాయి. చూడాలి మరి ఏమవుతుందో ?

More Related Stories