English   

మరో మారు క్రేజీ కాంబో...

 Surender Reddy
2020-05-26 10:56:17

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన అల వైకుంఠపురంలో సినిమా మొన్న సంక్రాంతికి రిలీజ్ అయి బంపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా మొదటి ఆట నుండే మంచి హిట్ టాక్ తో దూసుకు పోయింది. దీంతో మునుపెన్నడూ లేని విధంగా నాన్ బాహుబలి రికార్డ్స్ కూడా బద్దలు కొట్టింది ఈ సినిమా. ఇక బన్నీ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఆ తర్వాత వేణు శ్రీరామ్‌ తో ఐకాన్‌ సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది. ఇవి రెండు పూర్తయ్యాక ఏ సినిమా చేయనున్నాడు ? అనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే బన్నీకి మారుతి ఒక కధ చెప్పాడని, అది ఆయనకు నచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఎంత ఉందనేది ఇంకా క్లారిటీ లేదు. 

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన సురేందర్ రెడ్డితో కూడా ఒక సినిమా చేయనున్నాడని అంటున్నారు. గతంలో సురేందర్‌ రెడ్డి తెరకెక్కించిన ‘రేసుగుర్రం’ ఘన విజయం అందుకుంది. బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. బన్నీకి ఈ సినిమా మంచి జోష్ ఇవ్వడమే కాక కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాగా నిలిచింది. మరోసారి అదే ఉత్సాహంతో సినిమా చేసేందుకు బన్నీ సురేందర్ రెడ్డిలు సన్నద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ లాక్ డౌన్ లో సురేందర్‌ ప్రస్తుతం వక్కంతం వంశీతో కలిసి బన్నీకి ఓ అదిరిపోయే కథను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. రేసుగుర్రం కథ అందించింది కూడా వంశీనే, కానీ ఆయన దర్శకత్వంలో వచ్చిన నా పేరు సూర్య మాత్రం దెబ్బ వేసింది. ఇక అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘పుష్ప’, ‘ఐకాన్‌’ చిత్రాలు పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే అవకాశాలున్నాయి.  

More Related Stories