English   

చిరంజీవితో సినిమాలు చేయకపోవడానికి కారణం అదేనట

suresh
2019-06-18 09:02:06

సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామానాయడు ఎన్నో విజయవంతమైన సినిమాలను స్టార్ హీరోలతో నిర్మించారు. నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణలతో ఎన్నో భారీ సినిమాలను నిర్మించిన ఆయన మెగాస్టార్ చిరంజీవితో మాత్రం 'సంఘర్షణ' సినిమాను మాత్రమే తీశారు. ఆనాటి నుండి ఈ నారి వరకూ చిరు ఆ బ్యానర్ లో మరో సినిమా చేయలేదు. నిజానికి చిరూ బావ మరిది అల్లు అరవింద్ కి గీతా ఆర్ట్స్ ఉండడం వలన చేయలేదని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ దానికి గల అసలు కారణాలు తాజాగా నిర్మాత సురేష్ బాబు వెల్లడించారు. అప్పట్లో చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉండేవారని, రామానాయుడు గారికి చిరంజీవిగారికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేదని చెప్పుకొచ్చారు. ఆరోజుల్లో విజయవంతమైన సినిమాలకి సురేష్ ప్రొడక్షన్స్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేదని, 90లలో టాలీవుడ్ ను ఒక ఊపు ఊపుతున్న చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉండేవారని నాన్న సాన్నిహిత్యంతో మా బ్యానర్ లో చేయమని అడిగితే టైం అడుగుతారేమోనని ఒక అనుకునేవారని అయితే సురేష్ ప్రొడక్షన్ లో గ్యాప్ రాకుండా చిత్రాలను నిర్మించేవాళ్ళని అప్పట్లో చిరంజీవి బిజీగా ఉండడం వలన ఆయనతో మరో సినిమాను నిర్మించలేకపోయామని సురేష్ బాబు చెప్పుకొచ్చారు. నిజానికి మా బ్యానర్ లో స్టార్ హీరోల కోసం ఎదురుచూడకుండా ఆయన కథలను ఎక్కువగా నమ్మేవారని అలా చేసిన సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు.

More Related Stories