English   

తమ్ముడి కోసం అన్న పూజలు 

Suriya-Karthi
2018-06-23 14:42:49

అన్నదమ్ముల అనుబంధం వెండితెరపై ఉన్నంత గొప్పగా బయట ఉండదంటారు. కానీ ఈ ఇద్దరూ ఆన్ స్క్రీన్ లో ఎప్పుడూ కలిసి నటించలేదు కానీ.. బయట మాత్రం నిజంగా భలే ఉంటారు. మరి ఆ ఇద్దరూ ఎవరో తెలుసా.. స్టార్ హీరోస్ సూర్య అండ్ కార్తి. ఇద్దరూ ఫ్రెండ్స్ లా ఉంటారు. తమ్ముడి కెరీర్ కోసం సూర్య చాలా కేర్ తీసుకుంటాడు. అలాగే అన్న సినిమాలకు సంబంధించి కార్తి చాలా ప్రమోషన్స్ చేస్తుంటాడు. ఒక రకంగా  ఈ ఇద్దరి బంధం గొప్పగా ఉంటుందని ఎవరైనా చెబుతారు.. 

ఇక లేటెస్ట్ గా కార్తీ చినబాబు అనే సినిమా చేశాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. కార్తీ రైతుగా నటించాడు. ఆ మధ్య విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో విడుదల కాబోతోన్న ఈ మూవీ తెలుగు ఆడియో విడుదల చేయబోతున్నారు. అయితే ఆడియో విడుదల కంటే ముందే తమ్ముడి సినిమా హిట్ కావాలని సూర్య దర్శకుడు పాండిరాజ్ తో కలిసి సింహాచలం గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు. అఫ్ కోర్స్ కార్తీ కూడా ఈ పూజలకు అటెండ్ అయ్యాడు. అలాగే కమెడియన్ పరోటా బాలు కూడా వీరితో ఉన్నాడు. ఇక ఈ ఆడియోను ఇవాళ సాయంత్ర సిఆర్ రెడ్డి ఎన్ కన్వెన్షన్ హాల్ ఆంధ్రా యూనివర్శిటీ సౌత్ క్యాంపస్ లో నిర్వహించబోతున్నారు. ఏదేమైనా సూర్యకు ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రత్యేకమైన అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు.. మొత్తంగా అన్న పూజలు ఫలించి తమ్ముడి సినిమా చినబాబు పెద్ద విజయం సాధించాలని మనమూ కోరుకుందాం.. 

More Related Stories