English   

మార్చ్ 27.. మెగాభిమానుల‌కు పండ‌గే.. 

Charan-Birthday
2018-03-12 13:16:35

మార్చ్ 27 ఏంటి అనేది మెగా అభిమానుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ రోజు రామ్ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు. అదే రోజు మ‌రో రెండు పండ‌గ‌లు కూడా రాబోతున్నాయి. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం మూడు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. అందులో రంగ‌స్థ‌లం మార్చ్ 30న విడుద‌ల కానుంది. ఈ చిత్రంతో పాటు బోయ‌పాటి సినిమాకు కూడా క‌మిట‌య్యాడు చ‌ర‌ణ్. ఈ చిత్ర షూటింగ్ మొద‌లైంది కానీ ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర‌ణ్ మాత్రం సెట్ లో అడుగు పెట్ట‌లేదు. మొన్న‌ట్నుంచే జాయిన్ అవ్వాల్సి ఉన్నా.. రాజ‌మౌళి సినిమా కోసం అమెరికా వెళ్లాడు చ‌ర‌ణ్. ప‌ది రోజుల్లో మ‌ళ్లీ ఇండియాకు తిరిగి రానున్నాడు. వ‌చ్చిన త‌ర్వాత బోయ‌పాటి శీను సినిమాపై దృష్టిపెడ‌తాడు. ఇక రాజ‌మౌళి సినిమా అక్టోబ‌ర్ నుంచి ప‌ట్టాలెక్క‌నుంది. ఈ సంగ‌తి ఇలా ఉంటే.. రామ్ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజును ప్ర‌త్యేకంగా ప్లాన్ చేస్తున్నారు ఆ రోజు రెండు స‌ర్ ప్రైజులు ఇవ్వ‌బోతున్నారు. బోయ‌పాటి శీను చిత్ర ఫ‌స్ట్ లుక్ తో ఆ రోజు బ‌య‌టికి రానుంది. ఇక రాజ‌మౌళి సినిమా గురించి అనౌన్స్ మెంట్ కూడా అదే రోజు రానుంద‌ని తెలుస్తుంది. ఈ రెండు మెగా అభిమానుల‌కు ప్ర‌త్యేకంగా మార‌నున్నాయి. మ‌రోవైపు బ‌ర్త్ డే త‌ర్వాత మూడు రోజులకే రంగ‌స్థ‌లం విడుద‌ల కానుంది. దాంతో మెగాభిమానుల‌కు మార్చ్ చివ‌రివారం అంతా పండ‌గే పండ‌గ‌. 
 

More Related Stories