English   

క‌న్ఫ‌ర్మ్.. సూర్య‌-కార్తి మ‌ల్టీస్టార‌ర్..

Surya karthi multi-starrer movie

ఒకే ఇంట్లో అన్నాద‌మ్ములు ఇద్ద‌రూ స్టార్స్ కావ‌డం చాలా అరుదుగా జ‌రుగుతుంది. సూర్య‌-కార్తి విష‌యంలోనూ ఇది జ‌రిగింది. ద‌క్షిణాదిన స్టార్ హీరోలుగా వెలిగిపోతున్నారు ఈ బ్ర‌ద‌ర్స్. ఇద్ద‌రూ విడివిడిగా న‌టిస్తూనే అద్భుతాలు చేస్తున్నారు. అలాంటిది ఇద్ద‌రూ ఒకే సినిమాలో క‌లిసి న‌టిస్తే అభిమానుల‌కు పండ‌గే ఇంక‌. ఇప్పుడు ఇదే జ‌ర‌గ‌బోతుంది. త్వ‌ర‌లోనే సూర్య‌-కార్తి క‌లిసి న‌టించ‌బోతున్నారు. దీనిపై క్లారిటీ ఇచ్చింది కూడా కార్తినే. అవును.. ఈ మ‌ధ్య చిన్న‌బాబు త‌మిళ వ‌ర్ష‌న్ క‌డైకుట్టి సింగం ఆడియో వేడుక‌లో మాట్లాడుతూ తాను అన్న‌య్య సూర్య‌తో క‌లిసి న‌టించే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంద‌ని చెప్పాడు. ఇప్ప‌టికే క‌థ కూడా సిద్ధం అవుతుంద‌ని క‌న్ఫ‌ర్మ్ చేసాడు. చిన‌బాబు సినిమాను కూడా సూర్య‌నే నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉండ‌గానే ఇప్పుడు అన్న‌య్య‌తో క‌లిసి న‌టించ‌బోతున్నాన‌ని చెప్పి ఫ్యాన్స్ కు తీపిక‌బురు చెప్పాడు ఈ హీరో. సూర్య‌-కార్తి క‌లిసి న‌టిస్తే ఆ సినిమాపై తెలుగులోనూ అంచ‌నాలు భారీగా ఉంటాయ‌న‌డంలో ఆశ్చ‌ర్యం లేదు. ఎందుకంటే ఇద్ద‌రికి తెలుగులోనూ మార్కెట్ ఉంది కాబ‌ట్టి. అయితే ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోయే ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పుడు సూర్య న‌టిస్తున్న ఎన్ జి కేతో పాటు కేవీ ఆనంద్ సినిమా పూర్తైన‌ త‌ర్వాత త‌మ్ముడు కార్తితో క‌లిసి న‌టించ‌బోతున్నాడు సూర్య‌. మ‌రి చూడాలిక‌.. ఈ మ‌ల్టీస్టార‌ర్ ఎలా ఉండ‌బోతుందో..? 

More Related Stories