English   

సూర్య, కార్తి మీరు సూపరెహే.. !!

surya-karthi
2018-07-02 14:02:08

సూర్య, కార్తి.. అన్నదమ్ములుగా కోలీవుడ్ లో దూసుకుపోతోన్న స్టార్స్. అన్నదమ్ములే అయినా కథల ఎంపికలో ఇద్దరివీ భిన్నమైన స్కూల్స్. తెలుగులో అన్నకంటే ఆలస్యంగా వచ్చిన కార్తీ అతని కంటే ఎక్కువ మార్కెట్ తెచ్చుకున్నాడు. అలాగే అన్నయ్య అభిమానులే కాక తనకంటూ సొంత ఫ్యాన్ బ్యాంక్ సెట్ చేసుకున్నాడు. బట్ ఏ మాటకామాటే.. ఈ ఇద్దరు అన్నదమ్ముల అనబంధం మాత్రం అద్భుతం అనే చెబుతారు ప్రతి ఒక్కరూ. అవన్నీ పక్కన బెడితే లేటెస్ట్ గా ఈ అన్నదమ్ములు ఓ పార్టీ కోసం అదిరిపోయే జోష్ ఉన్న పాట పాడారు. అఫ్ కోర్స్ ఇది ఓ సినిమాలోని సాంగే. కోలీవుడ్ లో వెంకట్ ప్రభు అనే టాలెంటెడ్ దర్శకుడు ఉన్నాడు. ఇతను ఈ ఇద్దరితోనూ సినిమాలు చేశాడు.

కార్తీతో బిరియాని అనే సినిమా, సూర్యతో మసిలమని అలియాస్ మాస్(తెలుగులో రాక్షసుడు) అనే సినిమాలు చేశాడు. బట్ ఈ రెండూ ఫ్లాపులే. అదే దర్శకుడు ఇప్పుడు చిన్న స్టార్స్ తో పార్టీ అనే సినిమా చేశాడు. త్వరలో విడుదల కాబోతోన్న ఈ మూవీలో ఓ పార్టీ సాంగ్ ను ఈ ఇద్దరు అన్నదమ్ములతో పాడించాడు. నిజానికి సూర్య, కార్తీ పెద్ద సింగర్సేం కాదు. పైగా తమకు ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడు కదాని లైట్ తీసుకోలేదు. తమ వల్ల అతనికి హెల్ప్ అవుతుందనుకున్నారు. వెంటనే వచ్చి సింగేశారు. అఫ్ కోర్స్ ఆ పాట చూస్తే ప్రొఫెషనల్ గానే ఉందనుకోండి. అంటే చింపేశారనే అనుకోవాలి. సో.. ఈ ఇద్దరు అన్నదమ్ముల పాట ఖచ్చితంగా పార్టీకి కొత్త మార్కెట్ పెంచుతుందనేది నిజం. ఏదేమైనా సూర్య, కార్తీ మీరు సూపరెహే.. 

More Related Stories