English   

సుశాంత్ కేసులో ఎయిమ్స్ కీలక రిపోర్ట్

Sushant Singh Rajput
2020-09-29 16:38:02

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఘటన సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ కు గురి చేసింది. మంచి క్రేజ్ ఉన్న సుశాంత్ చేతిలో ప్రాజెక్టులు ఉన్నపుడు ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు దారితీసింది. బాలీవుడ్ లో ఉన్న నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు ఇండస్ట్రీ కి చెందినవారు ఆరోపించడంతో బాలీవుడ్ లో వారసత్వంతో వచ్చిన నటీనటుల పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఇక మరోవైపు సుశాంత్ అతడి స్నేహితులు, రియా వల్లనే చనిపోయాడని సుశాంత్ కుటుంబం పోలీస్ స్టేషన్ట్ లో ఫిర్యాదు చేసింది. ఇక ఈ కేసులో సీబీఐ విచారణ కూడా వేగవంతం చేసింది. ఇదిలా ఉండగా ఈ కేసులో ఎయిమ్స్ వైద్య బృందం మరోసారి సుశాంత్ పోస్ట్ మార్టం రిపోర్టును విడుదల చేసింది. రిపోర్టులో సుశాంత్ మృతికి ఉరివేసుకోవడమే కారణమని పేర్కొంది. సుశాంత్ డీఎన్ఏ ను పరిశీలించిన తరువాతనే రిపోర్టును ఇచ్చామని ఎయిమ్స్ డాక్టర్లు చెబుతున్నారు. దీనిలో ఎలాంటి సందేహాలు లేవని తెలిపారు. ఎయిమ్స్ ఇచ్చిన రిపోర్టును సీబీఐ స్టడీ చేస్తోంది. అయితే సుశాంత్ ది హత్యా లేదంటే ఆత్మహత్యా అన్నది ఇప్పుడే చెప్పలేమని పేర్కొంది. ఇక సుశాంత్ గొంతును నుమలడం వల్లనే అతడు చనిపోయాడని సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ ఆరోపిస్తున్నారు.

More Related Stories