English   

సుశాంత్ అకౌంట్ నుండి భారీగా నిధుల మళ్లింపు 

 Sushant Singh Rajput
2020-08-10 08:58:11

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. 2019 మే - 2020 ఏప్రిల్ మధ్య సుశాంత్ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో నగదు మళ్లింపు జరిగినట్లు ఈడీ గుర్తించింది. సుశాంత్ మరణానికి ఏడాది ముందు నుంచి అతడితో ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ తో పాటు మరో సీఏకు చెందిన అకౌంట్లకు సుశాంత్ అకౌంట్ నుంచి రూ.2.63 కోట్ల నిధులు మళ్లించినట్లు తేలింది. అలానే సుశాంత్ తన సోదరి కోసం రెండు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయగా.. రెండు రోజుల తరువాత రెండు ఎఫ్‌డిల నుంచి రూ.2.5 కోట్ల దాకా వేరే ఖాతలకి మళ్ళించినట్లు తెలుస్తోంది. ఈ రెండు ఫిక్స్ డిపాజిట్లలో తగ్గింపులు 2019 నవంబర్ 26 న, 28 న జరిగి కొత్త ఫిక్స్ డిపాజిట్లు ఒక్కొక్కటి కోటి రూపాయల చొప్పున చేసినట్లు గుర్తించారు. అయితే ఇవన్నీ రియా ఆదేశాల మేరకే జరిగిందని సుశాంత్ కుటుంబం ఆరోపిస్తున్నది. మనీలాండరింగ్ కేసు నమోదు చేయడం వలన రియా మీద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్నది.   
 

More Related Stories