English   

సుశాంత్ బ్యాచ్ ల‌ర్ పార్టీ.. చైతూకు నో ఎంట్రీ..

sushanth
2018-07-26 08:30:36

బామ్మ‌ర్ది పెళ్లికి బావ ర‌చ్చ చేయ‌కుండా ఉంటాడా..? క‌చ్చితంగా చేస్తారు క‌దా.. అలాగే ఇప్పుడు అక్కినేని మేన‌ల్లుడి పెళ్లికి లొల్లి మామూలుగా ఉండ‌కూడ‌దు అంటున్నాడు నాగ‌చైత‌న్య‌. అయితే విచిత్రంగా త‌న పెళ్లి పార్టీకి చైతూనే ఆహ్వానించ‌లేదు సుశాంత్. అస‌లు విష‌యం ఏంటంటే ఈ కుర్ర హీరో ఓ బ్యాచ్ ల‌ర్ పార్టీ ఇస్తున్నాడు. దానికి కేవ‌లం బ్యాచ్ ల‌ర్స్ మాత్ర‌మే రావాలి. దాంతో అంతా రండి.. కుమ్మేద్ధాం అంటూ ట్వీట్ చేసాడు సుశాంత్. మీ పెళ్లి పోస్ట్ పోన్ చేసుకోడానికి ప‌ర్ ఫెక్ట్ రీజ‌న్ చెప్పండి.. వ‌చ్చి మా పార్టీలో జాయిన్ అయిపోండంటూ ఓ కాంటెస్ట్ ర‌న్ చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. అంతేకాదు విడుద‌ల‌కు ముందు చిల‌సౌ సినిమా కూడా చూసే అవ‌కాశం ఉంది. 

ఇదంతా ఈయ‌న చేస్తున్నది కూడా సినిమా కోస‌మే.. నిజం పెళ్లి కోసం కాదు. అయితే ట్విట్ట‌ర్ లో చైతూ చూసి ఏంటి నాకు ఎంట్రీ లేదా.. ఓన్లీ బ్యాచ్ ల‌ర్స్ కేనా.. నాలో ఇంకా బ్యాచ్ ల‌ర్ ఉన్నాడోయ్ అంటూ జోక్ పేల్చాడు. దానికి సుశాంత్ కూడా వెల్ క‌మ్ బ్ర‌ద‌ర్.. పార్టీ ఇచ్చేది నువ్వే క‌దా.. కానీ వ‌చ్చేట‌ప్పుడు స‌మంతకు చెప్పేసి వ‌చ్చేయ్ కుమ్మేద్ధాం అంటున్నాడు. ఆగ‌స్ట్ 3న చిల‌సౌ విడుద‌ల కానుంది. రాహుల్ ర‌వీంద్ర‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రం జులై 27 నుంచి వారం రోజులు వాయిదా ప‌డింది. అందుకే పెళ్లి పోస్ట్ పోన్ కు కార‌ణాలు అంటూ దాన్ని కూడా ప్ర‌మోష‌న్ కు వాడేసుకుంటున్నాడు సుశాంత్. 

More Related Stories