English   

ఎస్వీఆర్ కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణ‌ వాయిదా...చిరు వలనే ?

SV Rangarao Statue
2019-08-24 16:28:34

అలనాటి టాలీవుడ్  ప్రముఖ నటులు కీ.శే. ఎస్వీ రంగారావు కాంస్య విగ్ర‌హాన్ని తాడేప‌ల్లి గూడెం య‌స్.వి.ఆర్. స‌ర్కిల్, కె.య‌న్.రోడ్ లో రేపు ఆవిష్క‌రించేందుకు ప్లాన్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ విగ్ర‌హావిష్క‌ర‌ణ జ‌ర‌గాల్సి ఉంది. అయితే అనుకోని అవాంతరాల వలన ఈ ఆవిష్క‌ర‌ణ వాయిదా వేశామ‌ని నిర్వాహ‌కులు ప్రకటనలో పేర్కొన్నారు. విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ప్రభుత్వం నుండి  అనుమ‌తులు మంజూరు కాలేదని, ఆ అనుమతులు మంజూరు అయ్యాక కొత్త తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించారు. తాడేపల్లిగూ డెం ఎస్‌వీఆర్‌ సేవా సమితి కొన్ని నెలల కిందటే ఎస్‌వీఆర్‌ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అయితే దానిని చిరంజీవితోనే ఆవిష్కరింప జేయాలని ఎస్‌వీఆర్‌ సేవా సమితి సభ్యులు సంకల్పించడంతో విగ్రహావి ష్కరణ వాయిదా పడుతూ వచ్చింది. 

కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌ వెళ్లిన సభ్యులు చిరంజీవిని ఆవిష్కరించాల్సిదిగా కోరారు. దీనికి చిరంజీవి సానుకూలంగా స్పందించి ప్రభుత్వం తరపున అన్ని అనుమతులు ఉన్నప్పుడే ఆవిష్కరణ చేస్తానని అంగీకరించారు. అయితే అన్ని అమనుతులు ఉన్నాయని చెప్పి సభ్యులు మెగాస్టార్‌ చిరంజీవిని ఒప్పించారు. చిరంజీవి చేతులు మీదుగా నిర్వహించే ఎస్‌వీఆర్‌ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాల అభిమానులకు సమాచారం అందజేశారు. అయితే ఇంకా అనుమతులు వచ్చేస్తాయని భావించి చిరంజీవిని ఒప్పించినా అనుమతులు రాకపోవడంతో రిస్క్ చేయడం ఇష్టం లేక వాయిదా వేసినట్టు చెబుతోంది.

More Related Stories