English   

స్వ‌ర‌భాస్క‌ర్.. మగాళ్లకు మాత్ర‌మే..!

Swara Bhasker only for gents
2018-06-06 10:23:24

బాలీవుడ్ లో రోజుకో కొత్త హీరోయిన్ వ‌స్తుంటుంది. అక్క‌డ వ‌చ్చిన వాళ్లంతా స్టార్ కావ‌డం కష్టం. అవ‌కాశం వ‌చ్చిన‌పుడే ఉప‌యోగించుకోవాలి. ఇప్పుడు స్వ‌ర‌భాస్క‌ర్ కూడా ఇదే ప‌నిమీదుంది. ప్ర‌స్తుతం ఈ భామ పేరు బాలీవుడ్ లో బాగానే వినిపిస్తుంది. దానికి కార‌ణం వీరి ది వెడ్డింగ్ చిత్రం. అందులో సోన‌మ్ క‌పూర్, క‌రీనా క‌పూర్ లాంటి స్టార్స్ ఉన్నా కూడా స్వ‌ర‌భాస్క‌ర్ కూడా సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ అయింది. దానికి కార‌ణం అమ్మాయి గారు అందులో చేసిన ర‌చ్చ సీన్సే. కెమెరా ముందు త‌న‌కు తాను తృప్తి పొందే సీన్స్ కూడా ఈ చిత్రంలో చేసింది స్వ‌ర‌. ఇవి చూసి వామ్మో ఎవ‌ర‌బ్బా ఈ బ్యూటీ.. ఇలా రెచ్చిపోయింది అని మాట్లాడుకుంటున్నారు. ఈ వేడి ఇలా ఉండ‌గానే ఇప్పుడు మెన్స్ వ‌ర‌ల్డ్ మ్యాగ‌జైన్ కోసం మ‌రోసారి అందాలు ఆర‌బోసింది స్వ‌ర‌భాస్క‌ర్. క‌సిగా చూస్తూ మ‌గాళ్ల‌కు మాత్ర‌మే అంటుంది ఈ ముద్దుగుమ్మ‌. ఆల్రెడీ 30 వ‌చ్చిన త‌ర్వాతే ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది స్వ‌రా. కానీ బాలీవుడ్ లో 30 దాటిన త‌ర్వాతే స్టార్ ఇమేజ్ వ‌స్తుంది. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ స్వ‌ర‌భాస్క‌ర్ కు కూడా అప్లై అయితే దెబ్బ‌కు ఈ బ్యూటీ స్టార్ అయిపోయిన‌ట్లే..!

More Related Stories