English   

సైరా.. ఓ ప‌నైపోయింది బాబూ..!

Sye Raa Latest Schedule Wrapped
2018-07-27 15:26:47

చిరంజీవి ప్ర‌స్తుతం సైరాతో బిజీగా ఉన్నాడు. కొన్ని రోజులుగా ఇంకో ప‌నేదీ పెట్టుకోకుండా సైరా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు మెగాస్టార్. హైద‌రాబాద్ లోనే ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది. ఇప్పుడు సైరా మేజ‌ర్ షెడ్యూల్ పూర్తైంది. గ‌త 35 రోజులుగా సిటీలోనే కోకాపేట్ లోని సెట్ లో ఈ షెడ్యూల్ జ‌రుగుతుంది. ఎన్నో అడ్డంకుల‌ను దాటి మ‌రీ ఈ షెడ్యూల్ పూర్తి చేసాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. మ‌ధ్య‌లో వ‌ర్షాలు.. ప్ర‌కృతి ప్ర‌కోపాలు అన్నీ దాటేసి.. సైరా షెడ్యూల్ పూర్తైంది. పైగా అన్నీ నైట్ షెడ్యూల్సే.. బ్రిటీష్ వాళ్ల‌పై ఉయ్యాల‌వాడ పోరాడి వాళ్ల ఆయుధాల‌తో పాటు ఖ‌జానాను దొంగిలించే సీన్స్ ఈ షెడ్యూల్ లో చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. చిరంజీవి కూడా త‌న వ‌య‌సును కూడా లెక్క చేయ‌కుండా 63 ఏళ్ల‌కు ర‌ప్ఫాడిస్తున్నాడు. సైరా కోసం చాలా అంటే చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు మెగాస్టార్.

దీన్ని హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ గ్రెగ్ పావెల్ ఆధ్వ‌ర్యంలో షూట్ చేసారు. చిరంజీవితో పాటు ర‌వికిష‌న్, జ‌గ‌ప‌తిబాబు, న‌య‌న‌తార, సుదీప్ లాంటి స్టార్స్ చాలా మంది ఈ షెడ్యూల్ లో ఉన్నారు. తర్వాతి షెడ్యూల్ త్వ‌ర‌లోనే డేట్ చెప్ప‌నున్నాడు ద‌ర్శ‌కుడు. ఈ షెడ్యూల్ తో షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తైపోయింది. డిసెంబ‌ర్ లోపు టాకీ పూర్తి చేయాల‌ని చూస్తున్నారు చిత్ర‌యూనిట్. ఆర్నెళ్లు కేవ‌లం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కోస‌మే వాడుకోనున్నారు. ఎందుకంటే విఎఫ్ఎక్స్ వ‌ర్క్స్ ఇందులో చాలా ఉన్నాయ‌ని తెలుస్తుంది. మొత్తానికి సైరా టీం కష్టపడి ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. ఇక రాబోయే షెడ్యూల్ కు ఎన్ని క‌ష్టాలుంటాయో..?

More Related Stories