English   

చిరంజీవి సైరా కష్టాలు

Sye-Raa-Narasimha-Reddy
2018-02-14 14:16:28

మెగాస్టార్ చిరంజీవి.. ఖైదీ నెంబర 150తో మళ్లీ ఫామ్ లోకి వచ్చి బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. అయితే అలాంటి ఎంటర్టైనింగ్ మూవీస్ చేసుకుంటూ పోతే బావుండేది. కానీ బాలయ్య ను చూసి తాను కూడా ఏదో చేద్దాం అనుకున్నాడు. కానీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన దగ్గర్నుంచీ అన్నీ కష్టాలే. టెక్నీషియన్స్ నుంచి ఆర్టిస్టుల వరకూ అందరూ సైరాకు సమస్యగానే మారారు. వీరు మా సినిమాలో నటిస్తున్నారు అని ఫస్ట్ లుక్ లో అనౌన్స్ చేసిన చాలామంది ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రెహ్మాన్, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, సినిమాటోగ్రాఫర్ ఇలా అందరకూ తప్పుకున్నారు. ఇక వారిని ఆల్టర్ నేషన్స్ చూసుకుంటూ వెళుతోంది సైరా టీమ్. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నఈ మూవీ అవుట్ పుట్ చిరంజీవికి అస్సలు నచ్చలేదట. ఈ లోగా తన లుక్ చాలా మారింది. ఆ లుక్ ను విజువల్ ఎఫెక్ట్స్ లో పర్ఫెక్ట్ గా చూపించేందుకు మార్చుకున్నాడు. దీంతో ఇది కంటిన్యూటీకి ఇబ్బందిగా మారింది. అందుకోసం చాలాయేళ్ల తర్వాత చిరంజీవి విగ్ లు వాడేందుకు సిద్ధమయ్యాడు. 

మరోవైపు దర్శకుడు సురేందర్ రెడ్డిపైనా అసంతృప్తిగా ఉన్నాడు చిరంజీవి. ఇవన్నీ దాటుకుని ఈ నెల 23నుంచి సైరా నరసింహారెడ్డి రెండో షెడ్యూల్ కు సిద్ధమవుతోంది. ఈ షెడ్యూల్ లో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్స్ కూడా యాడ్ అవుతున్నారు. ఇవే కాక ఈ కథను ఉద్దేశించిన నాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అసలు స్వాతంత్ర్య సమరయోధుడే కాదు అనే విమర్శలు చరిత్రకారుల నుంచి విరివిగా వినిపిస్తున్నాయి. సినిమా రిలీజ్ టైమ్ కు చరిత్రకారులు నరసింహారెడ్డి ఎవరనే విషయాన్ని కాస్త కూలంకషంగా వివరిస్తే అది సైరాకు భారీ మైనస్ అవుతుంని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏదేమైనా సైరా మొదలైన దగ్గర్నుంచీ కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. 

More Related Stories