English   

మెగాస్టారా మ‌జాకానా..?

Sye-Raa-Narasimha-Reddy
2018-03-04 14:16:46

ఖైదీ నెంబ‌ర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ఆ మూవీతోనే బాక్సాఫీస్ కు త‌న రేంజ్ ఏంటో మ‌రోసారి చూపించాడు. ఇప్పటికే చాలా గ్యాప్ వ‌చ్చింది క‌దా ఆడియ‌న్స్ త‌న‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారా అనే అనుమానం కూడ ఉన్న చిరంజీవికి మెమ‌ర‌బుల్ హిట్ ఇచ్చారు ఆడియ‌న్స్. దీంతో త‌న నెక్ట్స్ మూవీ విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా స్టెప్ వేశాడు. తెలుగు నేల నుంచి బ్రిటీష్ వారిని ఎదురించిన తొలి యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి బ‌యోపిక్ లో న‌టించ‌బోతున్నారు. కొన్నాళ్ల క్రితం ఈ సినిమాపైనా ఎన్నో అనుమానాలు ఉండేవి. కానీ అన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఏకంగా ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేశారు. వ‌చ్చే యేడాది సంక్రాంతికి విడుద‌ల చేసేలా షెడ్యూల్స్ క‌దుపుతున్నారు. 

అయితే భారీ బ‌డ్జెట్ తో రూపొందుతోన్న ఈ మూవీకి ఆల్రెడీ స‌గం రెవిన్యూ వ‌చ్చేసింది. అవును.. అమెజాన్ ప్రైమ్ డిజిట‌ల్ స్ట్రీమింగ్ కోసం సైరాను అమ్మేశారు. దీనికోసం ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ తెలుగు సినిమాకూ ఇవ్వ‌నంత భారీ రేట్ పెట్టేసింది అమెజాన్. అంటే ఏకంగా 30కోట్ల‌తో డీల్ సెట్ అయింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే సినిమా విడుద‌లైన కేవ‌లం 28 రోజుల్లోనే స్ట్రీమింగ్ కు అనుమ‌తి ఇచ్చారంటున్నారు. దీనివ‌ల్ల థియేట‌ర్స్ లో ఫుల్ ర‌న్ కు ఇబ్బంది అవుతుంది. అయినా ఇంత రేట్ పెట్టాక ఆ మాత్రం డిమాండ్ చేస్తారు క‌దా.. అయితే ఇది ఒక్క తెలుగుకు మాత్ర‌మే కాదు.. సైరా విడుద‌ల కాబోతోన్న త‌మిళ్, హిందీ భాష‌ల రైట్స్ కూడా ఈ  30కోట్ల‌లోనే ఉన్న‌ట్టు లెక్క‌. అంతే కాక సైరా సినిమాకు సంబంధించిన ప్ర‌తి కంటెంట్ కూడా అమెజాన్ కే ఇవ్వాల‌నే ఒప్పందం ఉందంటున్నారు. అంటే ఫ‌స్ట్ లుక్ నుంచి టీజ‌ర్, ట్రైల‌ర్స్, మేకింగ్ వీడియోస్.. ఇలా.. అయితే ఒక్క 28రోజుల్లోనే స్ట్రీమింగ్ అనే మాట త‌ప్ప ఇది ఎలా చూసినా లాభ‌సాటి డీలింగే. దీంతో పాటు ఇంకా శాటిలైట్ మార్కెట్ నుంచి మ‌రో 30కోట్ల‌కు పైగానే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. దీన్ని బ‌ట్టి స‌గానికి పైగా బ‌డ్జెట్ వ‌చ్చేసిన‌ట్టే అనుకోవ‌చ్చు. ఇక థియేట్రిక‌ల్ రైట్స్ కు కూడా భారీ పోటీ ఉంటుంది కాబ‌ట్టి నిర్మాత రామ్ చ‌ర‌ణ్ కు సైరా టేబుల్ ప్రాఫిట్ తెచ్చే ప్రాజెక్టే. మొత్తంగా రీ ఎంట్రీలోనూ ఈ రేంజ్ లో దుమ్మురేపోతోన్న మెగాస్టార్ ను చూస్తే ద‌టీజ్ మెగాస్టార్ అనకుండా ఉండ‌లేం..

More Related Stories