English   

బుల్లితెరపై సైరా ఎందుకు వెనకబడింది..

 Sye Raa Narasimha Reddy
2020-01-24 10:41:27

'సైరా నరసింహారెడ్డి' చిత్రంతో చిరంజీవి కలను నిజం చేసిన తనయుడిగా, నిర్మాతగా ప్రశంసలు అందుకున్నాడు రామ్ చరణ్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'ఉయ్యాల వాడ నరసింహరెడ్డి' జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'సైరా' రికార్డులు క్రియేట్ చేసింది. బాక్సాఫీసు దగ్గర దుమ్ములేపిన సంగతి తెలిసిందే. అయితే మెగాస్టార్ కెరీర్లో ది బెస్ట్ గా నిలిచిని ఈ చిత్రం.. బుల్లితెరపై మాత్రం వెనకపడింది.

ఈ సినిమా ప్రీమియర్ సంక్రాంతి సందర్భంగా బుల్లితెరపై సందడి చేసింది. అయితే ముందు నుంచే సైరాకు బుల్లితెరపై ఓ రేంజ్ లో టి.ఆర్.పి వస్తుందని భావించి సంక్రాతికి టెలికాస్ట్ చేసారు. కానీ సైరాకి ఆశించిన టి.ఆర్.పి రాకపోవడం ఆశ్చర్యపరిచింది. సైరా కేవలం 11.8 టి.ఆర్.పి రేటింతో సరిపెట్టుకుంది. అయితే.. ఇందుకు కారణం లేకపోలేదు.. చాలామంది ఈ చిత్రాన్ని థియేటర్లో వీక్షించి ఘన విజయాన్ని అందించారు. అందుకే టీవిలో వెనకపడింది అంటున్నారు. 

మరో అసలు విషయం ఏంటంటే.. సైరా టెలికాస్ట్ అయిన రోజే మరో చానల్ లో వరుణ్ తేజ్.. గద్దలకొండ గణేశ్ కూడా టెలీకాస్ట్ అయింది. ఈ సినిమా సైరాను మించిన టి.ఆర్.పిని అందుకోవడం విశేషం. అయితే.. తమిళ్ లో మాత్రం 'సైరా' కు మంచి టి.ఆర్.పి రావడం మరో విశేషం. 

More Related Stories