English   

సైరా అంతా రెడీ.. అన్న‌య్య వ‌స్తున్నాడు..

sye raa narasimha reddy

సైరా కొత్త షెడ్యూల్ కు అన్నీ సిద్ధం అవుతున్నాయి. ఈ సినిమా తొలి షెడ్యూల్ అయిపోయి రెండు నెల‌లు గ‌డిచినా ఇప్ప‌టికీ రెండో షెడ్యూల్ ను మొద‌లు పెట్ట‌లేదు. ఇప్పుడు అది జ‌ర‌గ‌బోతుంది. ఈ పాటికే రెండో షెడ్యూల్ మొద‌ల‌వ్వాల్సి ఉన్నా కూడా అనుకోని కార‌ణాల‌తో ఆగిపోయింది. ఇక ఇప్పుడు మార్చ్ 5 నుంచి రెండో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. చిరంజీవితో పాటు మిగిలిన చిత్ర‌యూనిట్ కూడా ఈ షెడ్యూల్ కోసం ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. నిజానికి రంగ‌స్థ‌లంకు సైరాకు ర‌త్న‌వేలు ఒక్క‌డే సినిమాటోగ్ర‌ఫ‌ర్. అక్క‌డ ఆ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఇంకా పూర్తి కాక‌పోవ‌డంతో డివోపి ర‌త్న‌వేలు లాక్ అయ్యాడు. దాంతో త‌న‌య‌డి కోసం త‌న సినిమాను వాయిదా వేసుకున్నాడు చిరంజీవి. సైరా రెండో షెడ్యూల్ హైద‌రాబాద్ లోనే జ‌ర‌గ‌నుంది. ముందు కేర‌ళ‌, రాజ‌స్థాన్ అనుకున్నా చివ‌రికి భాగ్య‌నగ‌రంలోనే సెట్ చేసారు. అమితాబ్ తో పాటు న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుపతి, జ‌గ‌ప‌తిబాబు, సుదీప్ లాంటి స్టార్స్ అంతా ఈ షెడ్యూల్ లోనే చిరుతో పాటు జాయిన్ కానుండ‌టం విశేషం. ఇది భారీ షెడ్యూల్ అని తెలుస్తుంది. మ‌రి చూడాలిక‌.. సైరా రెండో షెడ్యూల్లో చిరు ఎలాంటి సాహ‌సాలు చేయ‌బోతున్నాడో..?

More Related Stories