English   

సైరా మెగా షెడ్యూల్ షురూ..?

Sye-Raa-Narasimha-Reddy

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా షూటింగ్ అనుకున్నదానికంటే వేగంగానే సాగుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సైరాగా తరకెక్కుతోన్న ఈ మూవీ రీసెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ నెల 23నుంచి రెండో షెడ్యూల్ కు వెళ్లబోతోంది. అయితే సినిమాకు సంబంధించి ఇది అత్యంత కీలకమైన షెడ్యూల్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సైరాలో నటించే అతిరథులంతా ఈ షెడ్యూల్ నుంచి షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు. హీరోయిన్ నయనతారతో పాటు ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ షెడ్యూల్ నుంచి సైరా టీమ్ తో కలవబోతున్నారు. చెప్పడానికి ఇది సెకండ్ షెడ్యూల్ అంటున్నారు. కానీ ఇది ఫస్ట్ షెడ్యూల్ కే కొనసాగింపుట. ఫస్ట్ షెడ్యూలింగ్ సరిగా లేకపోవడం వల్లే ఇది కంటిన్యూటీ చేస్తున్నారని టాక్. అయితే ఈ మేటర్ లీక్ అయితే సినిమాపై నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. అందుకే ఈ విషయంలో ఎవ్వరూ నోరు మెదపకుండా చూసుకుంటున్నారు. 

ఇక అమితాబ్, నయన్ తో పాటు తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, జగపతిబాబు కూడా ఈ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్నట్టు సమాచారం. మొత్తంగా మొదలైన దగ్గర్నుంచీ సైరా కు సంబంధించి చాలా గాసిప్పుడు వినిపించాయి. వీటిలో ప్రధానమైనది దర్శకుడిని తప్పిస్తున్నట్టు. మొదట్లో గుణశేఖర్ వస్తున్నాడు అన్నారు. అది కరెక్ట్ కాదని అతనే చెప్పాడు. ఇప్పుడు వినాయక్ పేరు వినిపిస్తోంది. వినాయక్ కూడా డైరెక్ట్ చేస్తున్నాడా అనేది తెలియదు కానీ.. ఈ మధ్య అల్యూమినియం ఫ్యాక్టరీ షూటింగ్ లో వినయ్ కూడా ఉన్నాడు. మరోవైపు ఇంకా సంగీత దర్శకుడు తేలలేదు. బాలారిష్టాలతోనే షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తున్నారంటే వీళ్ల కాన్ఫిడెన్స్ కు మెచ్చుకోవాల్సిందే. 

More Related Stories