English   

మరికొన్ని గంటల్లో మెగా సంబరాలు

Sye Raa Teaser Releasing in Few Hours
2018-08-21 05:49:38

అక్క‌డ విడుద‌ల‌వుతున్నది సినిమా కాదు.. టీజ‌ర్.. కేవ‌లం టీజ‌ర్. కానీ దీనికే పండ‌గ చేసుకుంటున్నారు అభిమానులు. అన్న‌య్య వ‌చ్చేసాడు మ‌ళ్లీ అంటూ పండ‌గ చేసుకుంటున్నారు. ఎందుకో తెలియ‌దు కానీ మెగాస్టార్ సినిమా అంటే చాలు అదోర‌కం పిచ్చి అంతే. ఖైదీ నెం.150తోనే త‌న స్టామినా ఏంటో చూపించాడు ఈ హీరో. దాంతో అదే న‌మ్మ‌కంతో ఇప్పుడు ఏకంగా 200 కోట్ల‌తో సైరా సినిమా చేస్తున్నాడు. సురేంద‌ర్ రెడ్డి కూడా ఈ చిత్రాన్ని భారీ టెక్నిక‌ల్ క్రూతోనే తెర‌కెక్కిస్తున్నాడు. బాలీవుడ్ కూడా బిత్త‌ర‌పోయేలా.. మ‌రో రాజ‌మౌళిలా విజువ‌ల్ వండ‌ర్ ను క్రియేట్ చేస్తున్నాడు చిరంజీవి కూడా ఈ విష‌యంలో సురేంద‌ర్ రెడ్డికి అండ‌గా ఉంటున్నాడు. క‌థ విష‌యంలో కూడా చిరు నుంచి కావాల్సిన టైమ్ లో కావాల్సిన‌పుడు సూచ‌న‌లు వెళ్తున్నాయ‌ని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే టీజ‌ర్ కూడా మ‌రో స్థాయిలో ఉండ‌బోతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే టీజ‌ర్ చూసిన వాళ్లు కూడా తెలుగు సినిమా స్థాయిని మ‌రో మెట్టు ఎక్కించేలా ఉంటుందంటున్నారు. ఆగ‌స్ట్ 21 ఉద‌యం 11.30 నిమిషాల‌కు టీజ‌ర్ విడుద‌ల కానుంది. ఈ టీజ‌ర్ 39 సెక‌న్లు ఉంటుందని.. వార్ సీన్స్ అద్భుతంగా వ‌చ్చాయ‌ని.. చిరంజీవి లుక్ మాత్ర‌మే రివీల్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. సినిమా ఎంత గ్రాండ్ గా.. విజువ‌ల్ వండ‌ర్ గా ఉండ‌బోతుందో కూడా ఈ టీజ‌ర్ తో చెప్ప‌బోతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇప్ప‌టికే ఈ టీజ‌ర్ కు సంబంధించిన డిఐ పూర్త‌యింది. ఇక విడుద‌లై సంచ‌ల‌నం సృష్టించ‌డం మాత్ర‌మే త‌రువాయి. మొత్తానికి ఆగ‌స్ట్ 22 పుట్టిన‌రోజు అయితే ఒకరోజు ముందే ట్రీట్ ఇస్తున్నాడు మెగాస్టార్. అదెలా ఉండ‌బోతుందో చూడ్డానికి అభిమానులు కూడా వేచి చూస్తున్నారు.

More Related Stories