English   

సైరా టీజ‌ర్ అద‌ర‌హో..

SyeRaa Narasimha Reddy Teaser Out
2018-08-21 11:45:12

వ‌చ్చేసింది.. అన్న‌య్య టీజ‌ర్ వ‌చ్చేసింది.. అంచ‌నాలు పెంచ‌డానికి.. అనుకున్న‌ది సాధించ‌డానికి అన్న‌య్య వ‌చ్చేసాడు. 200 కోట్ల భారీ బ‌డ్జెట్ అద్భుతం ఎలా ఉండ‌బోతుందో చిన్న టీజ‌ర్ లో చూపించేసాడు చిరంజీవి. సురేంద‌ర్ రెడ్డి కూడా ఈ చిత్రాన్ని బాహుబ‌లి రేంజ్ లో తెర‌కెక్కించాల‌ని ఫిక్సైపోయిన‌ట్లు అర్థ‌మైపోతుంది. దానికి ఈ టీజ‌ర్ సాక్ష్యంగా నిలుస్తుంది. టీజ‌ర్ చూసిన త‌ర్వాత చ‌ర‌ణ్ ఎన్ని కోట్లైనా ఎందుకు పెట్ట‌డానికి రెడీగా ఉన్నాడో అర్థ‌మైపోతుంది. టీజ‌ర్ లోనే ఆ న‌మ్మ‌కం క‌న‌బ‌డిపోతుంది. చిరంజీవి లుక్ కానీ.. మేకింగ్ కానీ.. విజువ‌ల్స్ కానీ.. అన్నీ ఒక్క‌టేమిటీ అన్నీ సైరా టీజ‌ర్ లో అద్భుతం అనే ప‌దానికి త‌గ్గ‌కుండా ఉన్నాయి. అస‌లు చిరంజీవి ఈ ఏజ్ లో కూడా ఇంత‌గా ర‌చ్చ చేస్తూ ఫిట్ గా ఉండ‌టం చూస్తే ఓ సినిమా ఏ రేంజ్ లో ఉండ‌బోతుందో అర్థ‌మైపోతుంది. మొత్తానికి ఆగ‌స్ట్ 22 పుట్టిన‌రోజు అయితే ఒకరోజు ముందే ట్రీట్ ఇచ్చాడు మెగాస్టార్. సెట్ ల విష‌యంలోనూ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. 2019లో విడుద‌ల కానుంది సైరా.

 

More Related Stories