English   

తాప్సీ లవ్ స్టోరీ విన్నారా ?

Tapsee-Pannu
2019-01-11 18:52:32

తెలుగులో ఝుమ్మంది నాదం సినిమాతో ఎంట్రీ  ఇచ్చిన తాప్సీ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. అయితే ఇక్కడ అవకాశాలు తగ్గడంతో ముందు తమిళం వంక చూసి అక్కడ వర్కౌట్ కాకపోవడంతో బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ బాగానే నిలదొక్కుకుంది. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో తాప్సీ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. అదేంటంటే ఆమె లవ్ మ్యాటర్. ఆమె స్కూల్ లో ఉన్నప్పుడే లవ్ లో పడిందట. ఆమె తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు, తన క్లాస్ లోనే ఉన్న ఒక అబ్బాయితో ప్రేమలో పడిందట. అయితే ఆ క్లాస్ లో ఉన్నప్పుడు బానే ఉన్న వారి లవ్ 10వ తరగతిలోకి వచ్చాక బ్రేకప్ అయ్యిందట. దేనికో తెలుసా బోర్డు ఎగ్జామ్స్ పై దృష్టి పెట్టాలని చెప్పిన ఆమె బాయ్ ఫ్రెండ్ తాప్సీని వదిలేశాడట. అలా ఆమె మొదటి లవ్ రిలేషన్ దెబ్బతినడం తట్టుకోలేక అప్పట్లో సెల్ ఫోన్స్ లేకపోవడం వలన, కాయిన్ బాక్స్ నుంచి ఆ అబ్బాయికి ఫోన్ కూడా చేసి తాప్సీ ఏడ్చిందట. అయితే ఆమె స్నేహితులతో పోలిస్తే నా ఫస్ట్ లవ్ రిలేషన్ ఆలస్యమైందని తాప్సీ భావించేదట. ఎంత ఫన్నీగా ఉందొ కదా, తాప్సీ లవ్ స్టోరీ.

More Related Stories