English   

తాప్సీ హాటెస్ట్ లిప్ లాక్ తో స్టార్ట్

Taapsee Pannu Hottest Lip Lock in Manmarziyaan Trailer
2018-08-09 17:38:29

తాప్సీపన్ను.. ఈ ఢిల్లీ డాళ్ తెలుగులో ఎంట్రీ ఇచ్చినా.. ఇక్కడ కేవలం అందాల ప్రదర్శనకు మాత్రమే పరిమితమైంది. మరీ హెవీ ఎక్స్ పోజింగ్ చేయడానికి కూడా అమ్మడి దగ్గర అన్ని సోయగాలు లేవు. దీంతో అవీ తగ్గాయి. కొన్నాళ్లు సెకండ్ హీరోయిన్ గానూ సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేసింది. బట్.. అవి కూడా పోయాయి. దీంతో బాలీవుడ్ లో ట్రై చేసింది. అక్కడ పింక్ రూపంలో గ్రాండ్ లక్ వచ్చింది. తర్వాత బేబితో మరోసారి ఆకట్టుకుని బాలీవుడ్ లో బలమైన కథలున్న సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ వస్తోంది. లేటెస్ట్ గా వచ్చిన ‘ముల్క్’ అనే సినిమాలో అమ్మడు మరోసారి నట విశ్వరూపం చూపించి శభాష్ అనిపించుకుంది. అయితే ఈ సినిమాలో శభాష్ అనిపించుకుందో లేదో.. ఇప్పుడు మరో సినిమాలో అదిరిపోయే రేంజ్ లో అధర చుంబనాలతో రెచ్చిపోయింది.

బాలీవుడ్ లో లిప్ లాక్ లు ఎప్పుడో కామన్ అయిపోయాయి. అందుకే ఇక్కడ బెట్టు చేసే కాజల్ వంటి బ్యూటీస్ కూడా లిప్ లాక్ చేయక తప్పలేదు. అయితే అసలే బోల్డ్ గా నటించేందుకు ఏ మాత్రం బాధ లేని తాప్సీ చేసిన లిప్ లాక్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయిపోయింది. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ లో వస్తోన్న ‘మన్మార్జియాన్’ అనే సినిమాలో అమ్మడు హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ లోనే ఓ రేంజ్ లో రెచ్చిపోయింది తాప్సీ.. ఓ హాటెస్ట్ లిప్ లాక్ తోనే ఈ ట్రైలర్ మొదలవుతుంది. తర్వాత ఒంటినిండా బట్టలున్నా.. రొమాన్స్ చేస్తూ ఓ రేంజ్ లో రెచ్చిపోయిందనే చెప్పాలి. 
రీసెంట్ గా వచ్చిన సంజు సినిమాలో సంజయ్ దత్ ఫ్రెండ్ పాత్రలో ఆకట్టుకున్న విక్కీ కౌశల్ ను తను ప్రేమిస్తుంది. ఇద్దరూ హద్దులు దాటేస్తారు. కానీ అతను పెళ్లి విషయం ఎత్తేసరికి కామ్ అయిపోతుంటాడు. ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకోవడానికి విదేశాల నుంచి అభిషేక్ బచ్చన్ వస్తాడు. అభికి తాప్సీ ఫస్ట్ లుక్ లోనే నచ్చుతుంది. మరి అప్పటికే సెక్సువల్ గానూ ప్రేమలో పండిపోయిన తాప్సీ అభిషేక్ ను పెళ్లాడుతుందా.. ఆ ప్రియుడిని చేసుకుంటుందా అనేది కథగా తెలుస్తోంది. అయితే ఎంత హాట్ గా ఉందో.. అంతే అద్భుతమైన సీన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా తాప్సీ జెండా బాలీవుడ్ లో అన్ని రకాలుగా బాగా ఎగురుతున్నట్టే కదా.. 

More Related Stories